శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (18:43 IST)

చికెన్ బ్రెడ్ బాల్స్ ఎలా చేయాలి?

చికెన్‌లో వెరైటీగా బ్రెడ్ బాల్స్ ఎలా చేయాలో తెలుసా అయితే చదవండి. పిల్లలకు స్నాక్స్‌ అంటే చాలా ఇష్టం. అలాంటి స్నాక్స్‌ను హెల్దీగా ఇంట్లోనే తయారు చేస్తే ఎలా ఉంటుంది. అలాంటి వెరైటీలో ఒకటే చికెన్ బ్రెడ్ బాల్స్. ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు: 
చికెన్ - అరకేజీ 
ఉల్లి, పుదీనా, కొత్తిమీర - రెండు కప్పులు 
నూనె, ఉప్పు - తగినంత
కోడిగుడ్లు - రెండు 
గరం మసాలా - ఒక స్పూన్ 
కారం - ఒక స్పూన్  
బ్రెడ్ ముక్కలు - ఆరు 
నిమ్మరసం - ఒక స్పూన్ 
 
తయారీ విధానం :
ముందుగా శుభ్రం చేసిన చికెన్‌ను కాసింత ఉప్పు, పసుపు చేర్చి ఉడికించుకోవాలి. ఉడికాక చికెన్‌ను మెత్తగా చేతులో వత్తుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్ చేర్చి ఉప్పు, లెమన్ జ్యూస్‌లతో పాటు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 
 
అలాగే బ్రెడ్‌ను పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్‌లో కోడిగుడ్లను గిలకొట్టుకోవాలి. స్టౌ మీద నూనె వేడయ్యాక బాల్స్‌గా చేసుకున్న చికెన్‌ను కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి.. బ్రెడ్ పౌడర్‌లో పట్టించి.. కాగిన నూనెలో దోరగా వేయించుకోవాలి. 
 
తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి చికెన్ బాల్స్ తీసుకుని కొత్తిమీర, ఆనియన్స్‌తో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి.