శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2015 (19:56 IST)

కర్డ్ చికెన్ కర్రీ ఎలా చేయాలి?

బరువు తగ్గించుకోవాలంటే చికెన్-కర్డ్‌లో చేసే వంటకాలు ట్రై చేయండి. చికెన్‌లో పెరుగు చేర్చడం ద్వారా బాడీ హీట్ తగ్గుతుంది. తేలిగ్గా జీర్ణమవుతుంది. చికెన్‌లో లో ఫ్యాట్ ఉంటుంది. అలాగే పెరుగులో క్యాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్‌లో కర్డ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం... 
 
కావలసిన పదార్థాలు : 
చికెన్: అర కేజీ 
పెరుగు : ఒక కప్పు 
కారం : రెండు టీ స్పూన్లు 
ఆవాలు : ఒక టీ స్పూన్ 
పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ - తలా ఒక్కో టీ స్పూన్ 
ఉల్లి తరుగు : అర కప్పు 
పచ్చిమిర్చి తరుగు : ఒక టీ స్పూన్ 
నీరు, నూనె : తగినంత 
ఉప్పు: రుచికి సరిపడా 
 
తయారీ విధానం :
ముందుగా కుక్కర్లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. అందులోనే కారం, పసుపు, ధనియాల పొడి వేసి మరో నిముషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసం పోపు మొత్తం ఉడకనివ్వాలి. అందులో చికెన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి, కుక్కర్‌కు మూత పెట్టాలి.

ఒకటి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉండి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.  5నిముషాల తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత తీసి చికెన్‌కు పెరుగు మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరో ఐదు నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా రైస్‌కు కాంబినేషన్‌గా సర్వ్ చేయాలి.