శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By CVR
Last Updated : శనివారం, 17 జనవరి 2015 (18:58 IST)

వీకెండ్ స్పెషల్ : చికెన్ మసాలా ఫ్రైడ్ రైస్

కావలసి పదార్థాలు :
కోడి మాంసం - ఒక కప్పు (ముక్కలు)
అన్నం - రెండు కప్పులు
గుడ్లు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్ 
పుదీనా - అర కప్పు
కొత్తమీర - అర కప్పు 
ఉల్లిపాయలు - ఒకటి లేదా రెండు
పచ్చిమిర్చి - రెండు
టమోటాలు - రెండు 
కరివేపాకు - వాసన కోసం ఒకటి, రెండు
పసుపు - అర టీస్పూన్
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
కారం - ఒక టేబుల్ స్పూన్
గరం మసాలా పొడి - ఒక టేబుల్ స్పూన్
లవంగాలు - రెండు 
దాల్చిన చెక్క - ఒక చిన్న ముక్క
షాజీర - కొంచెం
 
 
తయారుచేయండి ఇలా: మొదట చికెన్‌ను నీటిలో బాగా శుభ్రం చేసుకుని, అందులో వున్న బోన్స్ తీసివేయాలి. తరువాత చిటికెడు ఉప్పు, కారం వేసి కొద్దిసేపు వరకు ఉడికించి, ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనెను పోసి వేడి చేసుకోవాలి. తరువాత అందులో కోడిగుడ్లను వేసి పొడిపొడిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. 
 
మరొక కడాయి తీసుకుని అందులో కొద్దివరకు నూనెను పోసి స్టౌ మీద వేడి చేసుకోవాలి. అందులో లవంగాలు, చెక్క, షాజీరాలను వేయాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను, మిరపకాయలను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కరివేపాకు, తరిగిన టమోటా ముక్కలను వేయాలి. టమోటాలు బాగా మగ్గిన తరువాత అందులో తరిగిన పుదీనా, కొత్తమీద వేసి కొద్దిసేపటివరకు వేయించాలి. కొద్దిసేపు తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా చేర్చి మరి కొంత సేపు వేయించాలి. 
 
తర్వాత ఆ మిశ్రమంలో ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేయాలి. అందులో పొడిగా ఉడికించుకున్న గుడ్లను వేసి రుచికి సరిపడేంత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడూ ఈ మిశ్రమంలో అన్నం వేసి వేయించుకోవాలి. అందులో మళ్లీ రుచికి సరిపడేంత ఉప్పు, గరంమసాలా పొడిని వేసి కలుపుతూ వేడి చేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీరను పైన చల్లుకుంటే సరి. అంతే ఘుమఘుమలాడే చికెన్ మసాలా రైస్ రెడీ.