శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By chitra
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2016 (17:22 IST)

నోరూరించే పీతల మసాలా వేపుడు

చలికాలంలో పీతల వంటకాలు శరీరానికి వేడినిస్తాయి. అయితే వీటిని మితంగా తీసుకోవాలి. పీతలతో కూరలు మాత్రమే గాకుండా వెరైటీగా వేపుడు ఎలా చేయాలో చూద్దాం..

చలికాలంలో పీతల వంటకాలు శరీరానికి వేడినిస్తాయి. అయితే వీటిని మితంగా తీసుకోవాలి. పీతలతో కూరలు మాత్రమే గాకుండా వెరైటీగా వేపుడు ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:  
పీతలు : అరకిలో (పెద్దవి)
టమోటాలు : రెండు 
ఉల్లిపాయలు : ఒక కప్పు 
కొబ్బరి తురుము : ఒక కప్పు 
గసగసాలు : రెండు టీ స్పూన్లు (నానబెట్టుకోవాలి)
కారం : రెండు టీ స్పూన్లు 
ఉప్పు : సరిపడేంత
జీలకర్ర : టీ స్పూన్ 
పచ్చిమిర్చి : మూడు 
మిరియాల  : పావు టీ స్పూన్ 
పసుపు : పావు టీ స్పూన్ 
కరివేపాకు : రెండు రెమ్మలు 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
నూనె : కావలసినంత
కొత్తిమీర : చిన్న కట్ట 
పోపుదినుసులు : తగినంత
గరంమసాలా : అర టీ స్పూన్ 
ధనియాలు :  ఒక టీ స్పూన్   
 
తయారీ విధానం :
పీతలు శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టాలి. మిక్సీ‌లో ధనియాలు, గసగసాలు, మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కొబ్బరితురుము, టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పచ్చి‌మిర్చి, గరంమసాలా వేసి గ్రైండ్ చేయాలి, అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్‌లా రుబ్బుకోవాలి.
 
స్టౌవ్ మీద పాత్ర పెట్టి నూనె వేడి చేయాలి. కాగాక పోపుదినుసులు, కరివేపాకు వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకు‌న్న మసాల ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. మసాలా పేస్ట్ రంగు మారిన వెంటనే పీతలు వేసి చిన్నమంటమీద ఉడికించాలి. చక్కటి వాసన వచ్చే వరకు వేయించి కొత్తిమీర జల్లి స్టవ్ ఆర్పేయాలి. అంతే గరం గరం పీతల మసాలా వేపుడు రెఢీ.