శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 12 జనవరి 2015 (17:33 IST)

ఎగ్ జోష్ ఎలా చేయాలి?

పిల్లలకు పెద్దలకు పౌష్టికాహారంలో మందున్న ఎగ్‌తో ఎగ్ జోష్ ఎలా చేయాలో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు:
ఉడికించిన కోడిగుడ్లు : నాలుగు 
ఉప్పు, కారం, నూనె : తగినంత 
పచ్చిమిర్చి : ఐదు 
వెన్న : 25 గ్రాములు 
టమోటాలు : రెండు 
ధనియాలపొడి : ఒక స్పూన్ 
క్రీమ్ : 10 గ్రాములు 
టేస్టింగ్ సాల్ట్ : 10 గ్రాములు 
ఉల్లి పాయ ముక్కలు : అరకప్పు  
 
తయారీ విధానం : 
రెండు ఉడికించిన గుడ్లను ముక్కలుగా కోసి వుంచుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక దానిలో కోసిన పచ్చిమిర్చి-ఉల్లిముక్కలు వేసి వేగాక, క్రీమ్, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి గుడ్ల ముక్కలను కూడా అందులో బాగా వేయించాలి. మిగిలిన రెండు గుడ్లను ముక్కలుగా కోసి వెన్నలో వేయించాలి. ఈ ముక్కలను సలాడ్‌లతో డెకరేట్ చేసి వడ్డించాలి.