గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By PNR
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (19:18 IST)

ఎగ్ మటన్ జింజర్ గార్లిక్ స్పెషల్

కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్‌ మటన్... అరకేజీ
అల్లం వెల్లుల్లి ముద్ద... ఒక టీ స్పూన్ 
కోడిగ్రుడ్లు.... నాలుగు
పచ్చిబొప్పాయి తురుము... నాలుగు టీ స్పూన్
పచ్చిమిర్చి... ఎనిమిది
గరంమసాలా... అర టీ స్పూన్
పెరుగు... ఒక కప్పు
ఉప్పు... తగినంత 
నిమ్మకాయలు... రెండు
కొత్తిమీర తరుగు... రెండు కప్పులు
మిరియాల పొడి... ఒక టీ స్పూన్
నూనె... తగినంత
 
తయారీ విధానం :
మటన్‌ను చిన్నచిన్న ముక్కలుగా కోసి మిక్సీలో బాగా మెత్తగా చేయాలి. ఇప్పుడు మటన్‌లో అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, గరంమసాలా, బొప్పాయి తురుము వేసి కలపాలి. ఈ ముద్దను ఓ వెడల్పాటి ప్లేటులో వేసి తగినంత ఉప్పు, పెరుగు, నిమ్మరసం, తురిమిన కొత్తిమీర కలిపి చిన్న ఉండలుగా చేయాలి. 
 
పెనం పొయ్యిమీద పెట్టి కొద్దికొద్దిగా నూనె వేస్తూ ఒక్కో ఉండనూ చిన్నగా ఒత్తి పెనంమీద అటూ ఇటూ కాల్చాలి. కోడిగుడ్ల సొనలో ఉప్పు వేసి గిలకొట్టి ఓ గరిటెడు మిశ్రమాన్ని పెనంమీద పలుచని ఆమ్లెట్‌లా వేయాలి. ఇప్పుడు అందులో వేయించి మటన్ ఉండను పెట్టి, దాన్ని ఆమ్లెట్‌తో మూసివేసి రెండువైపులా వేయించి తీసేయాలి. అంతే ఎగ్ మటన్ జింజర్ గార్లిక్ స్పెషల్ తయారైనట్లే..!