గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 12 జనవరి 2015 (17:45 IST)

కోడిగుడ్లతో రొయ్యల పొరుటు ఎలా చేయాలి.?

మహిళలు క్యాల్షియం పొందాలంటే వారానికి ఒక్కసారైనా రొయ్యలను డైట్‌లో చేర్చుకోవాలి. పిల్లల పెరుగుదలకు క్యాల్షియం ఎంతగానో సహకరిస్తుంది. అలాంటి రొయ్యలతో కోడిగుడ్డు పొరుటు ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
కోడి గుడ్లు : 10
రొయ్యలు : ఒక కేజీ 
ఉల్లిపాయ తరుగు : రెండు కప్పులు 
నూనె : పావు కిలో  
ఉప్పు : తగినంత 
పచ్చిమిర్చి : సరిపడా 
కొత్తిమీర : రెండు కట్టలు 
పసుపు : కొద్దిగా 
 
తయారీ విధానం : 
ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్న రొయ్యలు వేసి వేపండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు చేర్చాలి. బాగా వేగుతున్న తరుణంలో ఉప్పు, కారం వేసి, ఎసరు పోయండి. బాగా ఇగిరిపోయిన తర్వాత కోడిగుడ్లు కొట్టి వేయండి. కొత్తిమీర తరుగు కూడా దించేస్తే కోడిగుడ్ల రొయ్యల పొరుటు రెడీ.