శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (15:18 IST)

గోంగూర పీతలు తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
పీతలు - 500 గ్రా
గోంగూర - 2 కప్పులు
ఉల్లిపాయ - 1
ఉప్పు - సరిపడా
కారం - తగినంత
గరం మసాలా - 1 స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్స్
కొత్తిమీర తరుగు - 1 కప్పు
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసువు, మాంసం వేసి బాగా కలుపుకుని మంచి వాసన వస్తుండగా కొద్దిగా నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసిన గోంగూరను వేసి బాగా ఉడికే వరకు చిన్న మంటపై ఉంచుకోవాలి. ఆపై దింపే ముందు గరం మసాలా, కొత్తిమీర వేసి 3 నిమిషాల పాటు అలానే ఉంచాలి. అంటే గోంగూర పీతలు రెడీ. ఈ కూరను వేడివేడి అన్నం కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.