శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2015 (18:20 IST)

గోంగూర రొయ్యల కూర ఎలా చేయాలి?

గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. రొయ్యల్లో క్యాల్షియంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలున్నాయి. ఈ రెండింటీ కాంబినేషన్‌లో గ్రేవీ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
గోంగూర- కప్పు
రొయ్యలు-పావుకప్పు,
నెయ్యి/నూనె- 4 చెంచాలు
టమాటా తరుగు- ఒక కప్పు 
అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు టీస్పూన్లు 
ఉల్లిపాయలు- రెండు
పచ్చిమిర్చి, ఎండుమిర్చి- నాలుగు
తాళింపుదినుసులు- సరిపడా
ధనియాలపొడి - ఒక స్పూన్ 
పసుపు - అరచెంచా
కారం - 2 చెంచాలు
ఉప్పు - తగినంత
కరివేపాకు, కొత్తిమీర- గార్నిష్‌కు 
 
ఎలా తయారు చేయాలి? 
ముందుగా గోంగూర ఆకును బాగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. పాన్‌లో నెయ్యి లేదా నూనెను శుభ్రం చేసిన రొయ్యల్ని వేసి బాగా వేయించాలి. ఈ వేయించిన రొయ్యలను నెయ్యి లేకుండా విడిగా తీసిపెట్టుకోవాలి. ఈ మిగిలిన నెయ్యిలో ఎండుమిర్చి, తాలింపుదినుసులు ఉల్లిపాయముక్కలు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించాలి. 
 
అవి దోరగా వేగాక అల్లం వెల్లుల్లి మిశ్రమం ఆ తర్వాత టమాటా ముక్కలు చేర్చాలి. అనంతరం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర, కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి మూతపెట్టాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ధనియాలపొడి, వేయించిన రొయ్యల్ని చేర్చాలి. 5 లేదా 6 నిమిషాలు అయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే గోంగూర రొయ్యల కూర రెడీ.