గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By CVR
Last Updated : శనివారం, 10 జనవరి 2015 (19:38 IST)

వీకెండ్ స్పెషల్ - గోంగూర రొయ్యల కూర

కావల్సిన పదార్థాలు: 
గోంగూర - ఒక కప్పు 
రొయ్యలు - అర కప్పు 
నెయ్యి - నాలుగు టేబుల్ స్పూన్లు 
టమోటోలు - మూడు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్ 
ఉల్లిపాయలు - రెండు  
పచ్చిమిరపకాయలు - రెండు 
ఎండుమిర్చి - నాలుగు 
 పోపుదినుసులు (అన్నీ కలిపి) - కొద్దిగా
ధనియాలపొడి - అర టీ స్పూన్
పసుపు - పావు టీస్పూన్ 
కారం - 2 టీస్పూన్లు 
ఉప్పు - తగినంత 
కరివేపాకు - రెండు రెమ్మలు 
కొత్తిమీర తరుగు - కొద్దిగా 
 
ఇలా తయారుచేయండి:
మొదట గోంగూరను తొడిమల ఒలుచుకుని శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో వేసి సరిపడా నీళ్ళు పోసి ఉడికించి పెట్టుకోవాలి. మరో వైపు రొయ్యలను కూడా పొక్కులు తీసి బాగా శుభ్రం చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో రొయ్యలు వేసి లైట్ గా వేగించి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే అదే నెయ్యిలో ఎండుమిర్చి, పోపుదినుసులు వేసి ఒక నిముషం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు అందులోనే ఉడికించి పెట్టుకున్న గోంగూర, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ధనియాల పొడి, వేయించిన రొయ్యల్ని వేసి, మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకుని పది నిమిషాల పాటు పెద్ద మంట మీద బాగా ఉడికించి చివరిగా కొత్తిమీర తరుగు చల్లి దింపేస్తే సరిపోతుంది. అంతే రుచికరమైన గోంగూర రొయ్యల కూర రెడీ. గోంగూర అంటే ఇష్టపడేవారు కేవలం పచ్చళ్లుగానే కాకుండా ఈ విధంగా సీ ఫుడ్‌గా కూడా వండుకుని ఆరగించవచ్చు.