గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By PNR
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (15:58 IST)

గ్రిల్‌డ్ చికెన్ లెగ్స్ తయారీ ఎలా?

కావలసిన పదార్థాలు :
చికెన్ లెగ్స్... రెండు
ఉప్పు... సరిపడా
నిమ్మకాయ... ఒకటి
అల్లం వెల్లుల్లి ముద్ద... రెండు టీ స్పూన్లు
గడ్డపెరుగు... ఒక కప్పు
గరంమసాలా... ఒక టీ స్పూన్
మిరియాల పొడి... అర టీ స్పూన్
కారం... అర టీ స్పూన్ 
రెడ్ ఆరెంజ్ కలర్... చిటికెడు 
కొత్తిమీర, పుదీనా ముద్ద... రెండు టీ స్పూన్లు 
నూనె... సరిపడ. 
 
తయారీ విధానం :
 
చికెన్ లెగ్స్‌కు చాకుతో గాట్లు పెట్టి... ఉప్పు, నిమ్మరసం పూసి నానబెట్టాలి. ఒక గిన్నెలో పెరుగు వేసి అందులో గరంమసాలా పొడి, మిరియాల పొడి, కారం, రెడ్ ఆరెంజ్ కలర్, పుదీనా కొత్తిమీర ముద్ద కలిపి.. సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె వేసి ముద్దగా కలుపుకోవాలి.
 
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చికెన్ లెగ్స్‌కు బాగా పట్టించి, అరగంటసేపు నానబెట్టాలి. ఇప్పుడు ఓ నాన్‌స్టిక్ పాన్ తీసుకుని దానిమీద చికెన్ లెగ్ పెట్టి మసాలా కూడా దానిమీద పోసి మూతపెట్టి... తక్కువ మంటమీద ఒకవైపు పది నిమిషాలు ఉడికించాలి. చికెన్ లెగ్స్‌ను మరోవైపు తిప్పి మరో పది నిమిషాలు వేయించాలి.
 
అలా రెండు వైపులా పూర్తిగా వేగిన తరువాత దించేసి... పుదీనా చట్నీ లేదా ఏదేని సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. అంతే గ్రిల్‌డ్ చికెన్ లెగ్స్ రెడీ అయినట్లే...!