శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : గురువారం, 8 జనవరి 2015 (15:39 IST)

ఎగ్ ఖైమా శాండ్‌విచ్ ఎలా చేయాలి?

రోజుకో గుడ్డు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ఎగ్‌తో ఎప్పుడూ కూరలు, ఆమ్లెట్‌లా కాకుండా వెరైటీగా ఎగ్ ఖైమా సాండ్ విచ్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
ఉడికించిన కోడిగుడ్లు : ఎనిమిది 
పచ్చిగుడ్డు : ఒకటి 
నూనె : 150 గ్రాములు 
వెన్న : 50 గ్రాములు 
ఉల్లిపాయ తరుగు : ఒక కప్పు 
మిర్చి తరుగు : పావు కప్పు  
అల్లం పేస్ట్ : ఒక స్పూన్ 
బ్రెడ్ ముక్కలు : 16 
ఉప్పు : తగినంత 
వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్ 
 
తయారీ విధానం : 
ఉడికించిన గుడ్లను ఖైమాలా తరిగిపెట్టుకోవాలి. అలాగే ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని రుబ్బుకోవాలి. ఇందులో ఖైమా ముక్కల్ని కలపాలి. బ్రెడ్ ముక్కల మీద ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలను నూనెలో వేయించాలి. దోరగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేటులోకి తీసుకుని ఛిల్లీ సాస్ లేదా టమోటా సాస్‌తో వడ్డించాలి.