గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : బుధవారం, 24 సెప్టెంబరు 2014 (13:20 IST)

మటన్ సుక్క ఎలా చేయాలో తెలుసా?

మటన్ ఫ్రై.. మటన్ గ్రేవీలతో బోర్ కొట్టేసిందా..? అయితే మటన్ సుక్క ట్రై చేయండి. సాంబార్, రసం, రైస్‌కు మంచి కాబినేషన్ అయిన మటన్ సుక్కను ఇంట్లోనే తయారు చేయాలంటే ఎలా చేయాలోచూద్దాం... 
 
తయారీ విధానం : 
కావలసిన పదార్థాలు - ఒక కేజీ 
ఉల్లిపాయ తరుగు - రెండు కప్పులు 
టమోటాలు -  రెండు కప్పులు 
కరివేపాకు - 10 
ఎండు మిర్చి- 4 
మిరియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్ 
ఏలకులు - 2
దాల్చిన చెక్క: 1 అంగుళం 
లవంగాలు: 4 
జీలకర్ర: ఒక టేబుల్ స్పూన్ 
ధనియాలు: రెండు టేబుల్ స్పూన్లు 
పసుపు పొడి: ఒక టేబుల్  స్పూన్  
కారం పొడి: ఒక టేబుల్ స్పూన్  
నిమ్మరసం: రెండు టేబుల్ స్పూన్లు 
నూనె, ఉప్పు - సరిపడా.
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిర్చి:  పావు కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్ట్: రెండు టేబుల్ స్పూన్లు 
 
తయారీ విధానం : 
ముందుగా బోన్ లెస్ మటన్‌ను శుభ్రం చేసి.. మాంసం ముక్కలకు నిమ్మరసం, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి అరగంట పాటు పక్కన బెట్టుకోవాలి. అరగంట తర్వాత మ్యారినేట్ చేసిన మటన్‌ను కుక్కర్ లో వేసి, కొద్దిగా నీరు పోసి 2-3విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. అంతలోపు, ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క మరియు సోంపు ఫ్రైయింగ్ పాన్‌లో వేసి దోరగా వేయించాలి. 
 
వేగించుకొన్న మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత డీప్ బాటమ్ పాన్‌లో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి 5నిముషాలు తక్కువ మంట మీద వేపుకోవాలి 
 
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్  కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇప్పుడు అందులోనే గ్రైండ్ చేసుకొన్ని మసాలా పౌడర్ సగం వేసి, ఫ్రై చేసుకోవాలి. వెంటనే టమోటో ముక్కలు ఉప్పు కూడా వేసి వేగించుకోవాలి.
 
టమోటో మెత్తగా ఫ్రై అయిన తర్వాత, ప్రెజర్ కుక్కర్‌లోని మటన్‌లోని నీరు పక్కన వంపి పెట్టుకొని, మటన్ ముక్కలను మాత్రం వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 
 
తర్వాత మటన్ ఉడికించిన నీళ్ళలో సగం అందులో పోసి మరో 10నిముషాలు మసాలతో పాటు ఉడికించాలి. ఉడికేటప్పుడు అందులో మిగిలిన మసాల పౌడర్ ను వేసి, బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి.  చివరగా కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేయాలి. అంతే బోన్ లెస్ మటన్ సుక్క రెడీ.