శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 23 నవంబరు 2015 (18:15 IST)

పాలకూరతో రొయ్యల గ్రేవీ ఎలా చేయాలి?

పాలకూర, రొయ్యల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాలైన పోషకాలున్నాయి. పాలకూర రొయ్యల కాంబినేషన్‌లో కూర ట్రై చేశారా? అయితే ఇదిగోండి రిసిపీ.
 
కావలసిన పదార్థాలు : 
రొయ్యలు - అర కేజీ 
పాలకూర తరుగు - మూడు కప్పులు 
ఉల్లి తరుగు - ఒక కప్పు,
అల్లం వెల్లుల్లి పేస్ట్ - మూడు టేబుల్ స్పూన్లు 
ధనియాల పొడి - రెండు టేబుల్ స్పూన్లు
గరం మసాలా పొడి - ఒక టేబుల్ స్పూన్
పసుపు - అర స్పూన్ 
ఉప్పు, నూనె- తగినంత 
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు 
 
తయారీ విధానం : 
ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో శుభ్రం చేసుకున్న రొయ్యల్ని సన్నని సెగపై వేయించాలి. పచ్చివాసన పోయాక పక్కన పెట్టుకోవాలి. మరోపాన్‌లో నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. అందులోనే రొయ్యలు, కారం, ధనియాలపొడి కలిపి వేయించాలి. తర్వాత పాలకూర తరుగు, ఉప్పు కలిపి మూతపెట్టాలి. పాలకూర మెత్తబడ్డాక కప్పు నీటిని చేర్చి మరికొద్దిసేపు ఉడికించాలి. రొయ్యలు ఉడికి, కూర చిక్కబడ్డాక గరం మసాలా పొడి వేసి దించేయాలి. అంతే పాలకూరతో రొయ్యల గ్రేవీ రెడీ. ఈ గ్రేవీని అన్నంలోకి.. రోటీలకు చాలా టేస్టీగా ఉంటుంది.