మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2015 (19:12 IST)

రొయ్యలతో ఎగ్ గ్రేవీ ఎలా చేయాలి?

రొయ్యలు, కోడిగుడ్డులో చాలా ప్రోటీనులు ఉన్నాయి. క్యాల్షియంతో కూడిన ఎన్నో పోషకాలుండే ఈ రెండింటి కాంబినేషన్‌లో గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కోడిగుడ్లు -  ఆరు 
రొయ్యలు - అర కేజీ 
ఉల్లిపాయలు తరుగు - ఒక కప్పు 
టమోటా తరుగు - ఒక కప్పు 
పసుపు - ఒక టేబుల్ స్పూన్ 
కారం, ఉప్పు - తగినంత 
చింతపండు రసం  - అర కప్పు 
మెంతులు - పావు స్పూన్ 
 
తయారీ విధానం:
బాణలిలో నూనె పోసి వేడయ్యాక.. అందులో ఉల్లి తరుగు, మెంతుల్ని వేయించుకోవాలి. వేగాక టమోటాలు, పసుపుని చేర్చి వేపాలి. కారం, ఉప్పు కలుపుకుని శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసి కలిపి పది నిమిషాలు వేపాలి. తర్వాత చింతపండు రసం చేర్చి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికిన కోడిగుడ్లు వేసి కలిపి పది నిమిషాల పాటు ఉడికించి గ్రేవీలా తయారయ్యాక దించేయాలి. అంతే రొయ్యలతో ఎగ్ గ్రేవీ రెడీ అయినట్లే. ఈ గ్రేవీ రోటీలకు, అన్నంలోకి టేస్టీగా ఉంటుంది.