గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (16:48 IST)

గోంగూర రొయ్యల గ్రేవీ!

రొయ్యలతో గోంగూర కూర ఎలా చేయాలో తెలుసా...? గోంగూరతో మన శరీరానికి కావలసిన ఐరన్ లభిస్తుంది. అలాగే రొయ్యలతో కావలసిన పోషక పదార్థాలు లభిస్తాయి. ఎముకలకు ఎంతో మేలు చేసే రొయ్యలతో గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది.
 
గోంగూరతో రొయ్యల గ్రేవీ ఎలా చేయాలంటే..?
కావలసిన పదార్థాలు : 
రొయ్యలు - ఒక కిలో 
గోంగూర - ఒక కిలో 
నూనె - వంద గ్రాములు 
పచ్చి మిర్చి తరుగు -  పావు కప్పు 
వెల్లుల్లి - 8 రెబ్బలు 
కరివేపాకు- 10 రెబ్బలు 
ఎండు మిర్చి - 8 
తాలింపు దినుసులు - ఒక స్పూన్ 
ఉల్లిపాయలు - రెండు 
ఉప్పు- సరిపడా 
 
తయారీ విధానం :
రొయ్యలు వొలిచి శుభ్రం చేసి పెట్టుకోవాలి. గోంగూరను శుభ్రం చేసుకుని ఆకులు కోసుకుని అందులో కారం- ఉల్లి- పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి. గోంగూర మెత్తగా మగ్గాక దించి నీళ్లు వొంచేసి మెదిపి ఉప్పు వేసుకోవాలి. ఒక కళాయిలో నూనెపోసి బాగా కాగాక తాలింపు గింజలు వెల్లుల్లి- వేగాక గోంగూర వేసి బాగా కలిపి దింపుకోవాలి.