Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మిరియాలతో రొయ్యల మసాలా ఎలా చేయాలి...?

మంగళవారం, 30 జనవరి 2018 (13:12 IST)

Widgets Magazine

రొయ్యల్లో ప్రోటీన్లు, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా వుంటాయి. ఇవి ఎముకలకు బలాన్నిస్తాయి. అందుకే వారానికి ఓసారైనా రొయ్యలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కీళ్లు, మోకాళ్ల నొప్పులు నయం కావాలంటే.. పిల్లల ఆరోగ్యానికి మేలు చేకూరాలంటే.. రొయ్యలను తినాల్సిందే అంటున్నారు న్యూట్రీషియన్లు. అలాంటి రొయ్యలతో శీతాకాలానికి మేలు చేస్తే మిరియాలతో రొయ్యల మసాలా ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
రొయ్యలు- అరకేజీ 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు 
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు 
ఉల్లి తరుగు - అర కప్పు 
టమోటా తరుగు- అర కప్పు 
మిరియాలపొడి- ఒకటిన్నర స్పూన్ 
ధనియాల పొడి- ఒక టీ స్పూన్ 
పసుపు పొడి - అర టీ స్పూన్ 
జీలకర్ర పొడి- ఒకటిన్నర టీ స్పూన్ 
మిరియాల ముక్కలు - ఒక టేబుల్ స్పూన్ 
కొబ్బరి ముక్కలు - అర కప్పు
కొబ్బరి పాలు - ఒక కప్పు 
ఉప్పు, నూనె - తగినంత 
కరివేపాకు, కొత్తిమీర తరుగు- అర కప్పు
 
తయారీ విధానం :
బాణలిలో నూనె పోసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి పేస్టును చేర్చి బాగా వేపుకుని.. పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు చేర్చి దోరగా వేపాలి. ఆపై టమోటా ముక్కలను చేర్చి బాగా వేపుకోవాలి. ఆపై మిరియాలపొడి, ధనియాల పొడి, పసుపు పొడి, జీలకర్ర పొడులను చేర్చాలి. తగినంత ఉప్పు కూడా చేర్చాలి. బాగా గ్రేవీలా వచ్చిన తర్వాత కొబ్బరి పాలను చేర్చి.. మరిగా ఉడికించిన రొయ్యలను, కొబ్బరి ముక్కలను చేర్చాలి. కొబ్బరి పాలు ఇగిరాక.. కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేయాలి. ఈ మిరియాల రొయ్యల మసాలా రోటీలకు సైడిష్‌గా వాడుకోవచ్చు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వంటకాలు

news

వంటింటి చిట్కాలు: ఆకుకూరతో వేరుశెనగల్ని చేర్చి ఉడికిస్తే?

వంటనూనెలో రెండు మూడు మిరపకాయ వడియాలను వేసివుంచితే చాలారోజుల వరకు చెడకుండా వుంటుంది. రసం ...

news

శెనగలతో పిల్లల కోసం టేస్టీ చాట్

పిల్లల స్నాక్స్ బాక్సును షాపుల్లో అమ్మే స్నాక్సులతో నింపేస్తున్నారా? చిప్స్ వంటి ...

news

శీతాకాలంలో మిర్చి మంచిదే..

శీతాకాలంలో మిర్చి ఆహారంలో చేర్చుకోవాలంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మిర్చీలో ...

news

మధుమేహ వ్యాధిగ్రస్థులు అరటి ఆకులో ఉడికించిన చేప ముక్కల్ని తింటే?

మధుమేహం బారిన పడితే ఎన్నో ఆహార పదార్థాలను పక్కన బెట్టేయాల్సిందేనని చాలామంది అనుకుంటారు. ...

Widgets Magazine