బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (18:52 IST)

వింటర్ స్పెషల్ : స్పైసీ చికెన్ లాలీ పాప్స్!

వింటర్లో వేడి వేడిగా చికెన్ రిసీపీలు టేస్ట్ చేస్తే సూపర్‌గా ఉంటుంది కదూ.. అయితే స్పైసీ చికెన్ లాలీ పాప్స్ ఇంట్లోనే తయారు చేసేద్దాం.. ఎలా చేయాలంటే..?
 
కావలసిన పదార్థాలు : 
చికెన్ పీస్‌లు : లాలీ పాప్స్‌కు తగ్గట్లు అరకేజీ 
షేజ్‌వాన్ సాస్ : ఒక టీ స్పూన్ 
లెమన్ జ్యూస్ : ఒక టీ స్పూన్ 
పసుపు పొడి : ఒక టీ స్పూన్ 
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ : రెండు టీ స్పూన్లు
ఛాట్ మసాలా పౌడర్ : ఒక టీ స్పూన్ 
కారం : రెండు టీ స్పూన్లు 
ఉప్పు, నూనె : తగినంత 
పెరుగు : ఒక కప్పు 
 
తయారీ విధానం :
ముందుగా చికెన్ మ్యారినేట్ చేసేందుకు ఓ పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో శుభ్రం చేసిన చికెన్ ముక్కలు వేసి లెమన్ జ్యూస్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, షేజ్ వాన్ సాస్, పెరుగు, పసుపు పడి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టేంతవరకు మిక్స్ చేసి పది నుంచి 20 నిమిషాల పాటు ఊరనివ్వాలి. 
 
తర్వాత బాణలిలో నూనె పోసి వేడయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ లాలీ పాప్ పీస్‌లగా దోరగా వేయించుకుని సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి. అంతే చికెన్ లాలీపాప్స్ రెడీ. వీటిని టమోటా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేస్తే పిల్లలు లొట్టలేసుకుని తినేస్తారు.