శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (19:09 IST)

హెల్దీ ఆలివ్ ఆయిల్‌తో టేస్టీ చికెన్ రిసిపీ!

ఆలివ్ ఆయిల్‌తో టేస్టీ చికెన్ రిసిపీ ట్రై చేయండి. ఆలివ్ ఆయిల్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి ఆలివ్ ఆయిల్‌తో వెరైటీ చికెన్ రిసిపీ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
చికెన్ ముక్కలు - హాఫ్ కేజీ 
ఆలివ్ నూనె -  అరకప్పు 
ఉల్లి, వెల్లుల్లి పేస్ట్ - అర కప్పు 
కారం - నాలుగు టీ స్పూన్లు 
టమోటా పేస్ట్ - అర కప్పు 
క్రీం చీజ్ స్ర్రెడ్ - అర కప్పు 
మిరియాల పొడి - రుచికి తగినంత 
ఉల్లి కాడల తరుగు - పావు కప్పు 
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం : 
బాణలిలో సగం నూనె వేడిచేసి ఉడికించిన చికెన్‌ను ఫ్రై చేసి పక్కన బెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనెలో ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కల్ని వేయించాలి. అందులో పావు కప్పు మైదా పిండి, కారం, చికెన్ ఉడికించిన నీరు, టమోటా పేస్ట్ వేసేయాలి. రెండు మూడు నిమిషాల తర్వాత ముందుగా వేయించుకున్న చికెన్ కూడా వేసి మూత పెట్టేయాలి. చికెన్ ఉడికాక క్రీం చీజ్ స్ప్రెడ్ తగినంత ఉప్పూ, మిరియాల పొడి, ఉల్లికాడల తరుగు వేసి నీరంతా ఆవిరయ్యాక దింపేయాలి.