శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : గురువారం, 8 జనవరి 2015 (15:28 IST)

స్పెషల్ ప్రాన్ టోస్ట్ ఎలా చేయాలి?

రొయ్యల్లో సెలీనియం, విటమిన్-ఇ, విటమిన్-బి, విటమిన్ బి 12, ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటిలోని లో-కెలోరీలు శరీర బరువును నియంత్రిస్తాయి. అలాంటి ప్రాన్స్‌తో టేస్టీ టోస్ట్ ఎలా చేయాలో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు : 
రొయ్యలు : అర కేజీ 
పెరుగు : ఒక కప్పు 
ఉల్లిపాయలు : మూడు 
బంగాళాదుంపలు : రెండు 
అల్లం పేస్ట్ : రెండు చెంచాలు 
ధనియాలు : ఒక స్పూన్ 
లవంగాలు : మూడు 
యాలకులు : రెండు 
బఠానీలు : ఒక కప్పు 
బ్రెడ్ : ఒకటి 
నూనె : తగినంత 
వెల్లుల్లి, దాల్చిన చెక్కలు, గసగసాలు, కొత్తిమీర  పేస్ట్- రెండు స్పూన్లు 
ఉప్పు, కారం - తగినంత 
 
తయారీ విధానం : 
ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, గసగసాలు కొంచెం వేడిచేసి మెత్తగా రుబ్బుకోవాలి. శుభ్రం చేసిన రొయ్యలను ఉడికించుకోవాలి. బ్రెడ్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలను నూనెలో వేపుకుని పక్కన బెట్టుకోవాలి. 
 
కళాయిలో నూనెపోసి కాగాక తాలింపు చేర్చి వేగాక, ఉల్లి ముక్కలు చేర్చాలి. అల్లం ముద్దను చేర్చి ఉడికాక రొయ్యలు వేసి వేయించాలి. ఉప్పు, కారం, పెరుగు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. పూర్తిగా మగ్గాక దింపేముందు బఠానీలు చల్లాలి. పైన బ్రెడ్‌ముక్కలు పరవాలి. బంగాళాదుంప ముక్కలు కూడా వేయాలి. కొత్తిమీర చేర్చి దించేస్తే ప్రాన్స్ టోస్ట్ రెడీ.