బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (15:13 IST)

వాల్‌నట్ చికెన్ ఫ్రై తయారీ ఎలా?

కావలసిన పదార్థాలు :
కోడిగుడ్డులోని తెల్లని సొన మాత్రం... రెండు గుడ్లది
కారన్‌స్టార్చ్.. నాలుగు టీస్పూన్లు
సాల్ట్‌పెప్పర్... అర టీస్పూన్ 
నూనె... వంద గ్రాములు
కోడిమాంసం... 500 గ్రాములు 
వాల్‌‌‌‌నట్స్... ఒక కప్పు
 
తయారీవిధానం :
కోడిగుడ్డులోని తెల్లని సొనను మాత్రమే తీసుకొని కారన్‌స్టార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొంతనీటిని చేర్చి బాగా ఆమ్లెట్ మిశ్రమంలా తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. శుభ్రపరిచిన కోడి మాంసంలో సాల్ట్‌పెప్పర్ కలుపుకొని పక్కన ఉంచండి. మాంసం ముక్కల్ని కారన్‌స్టార్చ్ మిశ్రమంలో ఉంచి వాల్‌నట్స్‌పై అద్దాలి. బాణలిలో నూనెపోసి బాగా కాగాక అందులో కోడిమాంసం ముక్కల్ని పకోడీల్లాగా వేయించి, బ్రౌన్ వచ్చాక బయటకు తీసేయాలి. అంతే వాల్‌నట్ చికెన్ ఫ్రై రెడీ అయినట్లే...!