శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : శనివారం, 29 నవంబరు 2014 (18:23 IST)

బటర్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలంటే?

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలంలో తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అలాంటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన చేపలకు బటర్ చేర్చి ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. 
 
కావల్సిన పదార్థాలు: 
చేప ముక్కలు: ఒక కేజీ 
మైదా: రెండు టీ స్పూన్లు 
కార్న్ ఫ్లోర్: రెంటు టీ స్పూన్లు
బట్టర్ : తగినంత
బేకింగ్ పౌడర్: ఒక టీ స్పూన్ 
వెల్లుల్లి, కొత్తిమీర తురుము: రెండు టీస్పూన్లు 
ఉప్పు: రుచికి తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా వెల్లుల్లి తురుము, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ సౌడర్‌ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి కలుపుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా నీళ్ళు పోసి జారుడుగా గట్టిగా కలుపుకుని శుభ్రం చేసుకున్న చేపముక్కలకు ఈ మసాలాను పట్టించాలి. ఈ మసాలా పట్టించిన చేప ముక్కలను అరగంట పాటు పక్కనబెట్టుకోవాలి. తర్వాత నాన్ స్టిక్ పాన్‌లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను వేసి దోరగా వేపుకుని ఇరువైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే బటర్ ఫిష్ ఫ్రై రెడీ.. ఇది వేడి వేడి రైస్‌తో సర్వ్ చేస్తే అందరూ లొట్టలేసుకుని తింటారు.