బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : శనివారం, 13 సెప్టెంబరు 2014 (15:52 IST)

వీకెండ్ స్పెషల్ : మీట్ మసాలా కట్‌లెట్!

మీట్‌ ద్వారా శరీరానికి కావలసిన మాంసకృత్తులు అందుతాయి. మాంసాన్ని ఫ్రైలు, కూరలతో గాకుండా మెత్తగా కొట్టించిన మాంసంతో వెరైటీలు రెడీ చేస్తే పిల్లలకు ఎంతో నచ్చుతాయి. అందుకే ఈ వీకెండ్ మీట్ మసాలా కట్‌లెట్‌ను మీ పిల్లలే కాదు.. పెద్దలకు సూపర్ వెరైటీగా ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
మెత్తగా కొట్టించిన మాంసం: పావు కేజీ
 
మసాలా కోసం.. అరకప్పు కొబ్బరి, రెండు పచ్చిమిరపకాయలు, ఒక టీ స్పూన్ కారం, మూడు, నాలుగు లవంగాలు, రెండు దాల్చిన చెక్క ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, అరకప్పు శనగపప్పు, ఉప్పు.. తగినంత. 
 
తయారీ విధానం : కొద్దిగా నీరు పోసి మాంసాన్ని రుబ్బుకోవాలి. దీనికి రుబ్బిన మసాలా కలుపుకోవాలి. మరోసారి ఈ మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. వీటిని కట్‌లెట్ షేప్‌లో నొక్కుకుని కడాయిపై పేర్చి మూతపెట్టి, సన్నని సెగపై ఉడకనివ్వాలి.
 
మరో మూకుడులో నూనె వేడిచేసి ఈ బాల్స్ వేయించాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి.. టమోటా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేస్తే సూపర్ టేస్ట్‌గా ఉంటుంది.