శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (17:43 IST)

వీకెండ్ స్పెషల్: మటన్ కడాయ్ రిసిపీ!

నాన్ వెజ్ తీసుకోవాలంటే.. మటన్ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రేవీలు, రోస్ట్‌లే కాకుండా మటన్‌తో కడై మటన్ కర్రీ చేస్తే ఎలా ఉంటుందో ఈ వారం ట్రై చేద్దాం.
 
కావల్సిన పదార్థాలు: 
మటన్: అరకేజీ 
టమోటో తరుగు : ఒక కప్పు 
ఉల్లిపాయ :  నాలుగు 
పచ్చిమిర్చి పేస్ట్ :  రెండు స్పూన్లు
పెరుగు: అరకప్పు
గరం మసాలా : రెండు టీ స్పూన్లు 
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: ఒక టీ స్పూన్ 
కారం: రెండు టీ స్పూన్లు
ధనియాల పొడి: ఒక టీ స్పూన్ 
బిర్యానీ ఆకు: ఒక టీ స్పూన్ 
నూనె: 3 టేబుల్ స్పూన్లు 
అల్లం పేస్ట్: ఒక టీ స్పూన్ 
వెల్లుల్లి పేస్ట్: ఒక టీ స్పూన్ 
జీలకర్ర: ఒక టీ స్పూన్ 
 
తయారీ విధానం: 
ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ ముక్కల్లో ఉప్పు, పెరుగుతో మ్యారినేట్ చేసి అరగంట పాటు పక్కనపెట్టేయాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
 
తర్వాత అదే పాన్‌లో మటన్ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. అదే నూనెలో కొద్దిగా నూనె పోసి జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి మరికొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
 
ఉల్లి పేస్ట్ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 2-3నిముషాలు వేగించుకోవాలి. టమోటో, ధనియాలపొడి, గరం మసాలా, కారం, పసుపు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ మరో 5-10నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
 
ఈ మిశ్రమంలో మ్యారినేట్ చేసుకొన్న మటన్‌ను అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. 15-20 నిముషాలు మీడియం మంట మీద మటన్ పూర్తిగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడికిన తర్వాత అందులో ఫ్రై చేసుకొన్న పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసి దించేస్తే మటన్ కడై రిసిపీ రెడీ.