మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 30 జూన్ 2016 (15:05 IST)

ప్రథమ ప్రపంచ అమెరికా తెలంగాణ మహాసభలు(డిట్రాయిట్, జూలై 8-10 వరకు)

మరో రెండు వారాల్లో జూలై 8 నుండి 10 వరకు డిట్రాయిట్‌లో జరుగనున్న ప్రథమ ప్రపంచ అమెరికా తెలంగాణ మహాసభల(ataconvention.org) వేదిక మీదుగా ప్రపంచ సాంస్కృతిక యవనిక మీద తెలంగాణ సొంత అస్తిత్వపు బావుటాలని ఎగురవేయబోతున్నది. నరసింహ రావు నాగులవంచ, శ్రవణ్ ఎలువాక, క

మరో రెండు వారాల్లో జూలై 8 నుండి 10 వరకు డిట్రాయిట్‌లో జరుగనున్న ప్రథమ ప్రపంచ అమెరికా తెలంగాణ మహాసభల(ataconvention.org) వేదిక మీదుగా ప్రపంచ సాంస్కృతిక యవనిక మీద తెలంగాణ సొంత అస్తిత్వపు బావుటాలని ఎగురవేయబోతున్నది. నరసింహ రావు నాగులవంచ, శ్రవణ్ ఎలువాక, కన్వీనర్ వినోద్ కుకునూర్, కో-కన్వీనర్ నాగేందర్ ఐత గార్ల సారథ్యంలో ఇదే వేదిక మీదుగా ఒక పొలిటికల్ కమిటీ ఏర్పాటు కావడం, తద్వారా రాజకీయ-సామాజిక పరమైన చర్చలు, విశ్లేషణలు, తదితర కార్యకలాపాలనినిర్వహించడం జరుగుతుంది. 
 
ఈ సభలకు ఆత్మీయులు, మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీహెచ్ విద్యాసాగర్ రావు గారు పాల్గొననున్నట్లు ఆటా సమాఖ్య తెలియచేసారు. వీరితో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షులు, గౌరవ టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ మొహమద్ అలీ గారు, హోం మినిస్టర్ శ్రీ నాయిని నరసింహ రెడ్డి గారు, ఎంపీ శ్రీ జితేందర్ రెడ్డి గారు పాల్గొననున్నారు. అమెరికా, ఇండియా, కెనడా దేశాల నలుమూలల నుండీ దాదాపు 5000 మంది వరకు ప్రతినిధులు ఈసమావేశాల్లో పాల్గొననున్నారు. 35 స్థానిక తెలుగు సంఘాలు, వాటి ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.
 
బంగారు తెలంగాణ సాధనా దిశగా వివిధ విభాగాల మంత్రులు, వివిధ పార్టీల లీడర్లు, ఎం.ఎల్.ఎలు, ఎం.ఎల్.సీలు, రాజకీయ విశ్లేషకులు, పాలక-ప్రతిపక్షానికి చెందిన వివిధ ప్రజా ప్రతినిధుల సారస్వతన ఆటా పొలిటికల్ కమిటీ అందరి అభిప్రాయాలు, చర్చనీయ అంశాలు, అభివృద్ధి కార్యాచరణ లాంటి అంశాల మీద ముఖా ముఖి నిర్వహించనుంది. దేశ విదేశాల్లో విస్తరించి ఉన్న తెలుగు వారితో పటిష్టమైన సంబంధాలని, బంగారు తెలంగాణ భాగస్వామ్యాలని దిశానిర్దేశాకత్వం చేస్తూ జిల్లా స్థాయి చర్చలు కూడా జరుగనున్నాయి. 
 
ఆటా పొలిటికల్ కమిటీ నరసింహ రావు నాగులవంచ, శ్రవణ్ ఎలువాక, రామ్ దేవినేని, రామకృష్ణ కాసర్ల, శ్రీనివాస్ బండి, అనిల్ సుస్కండ్ల, సంతోష్ గండ్ర, కిరణ్ ఉప్పలాంచి అండ్ నరేష్ దొంతినేని ల ఆధ్వర్యంలో ఈ సమావేశాలని విజయవంతం చేయాలని, ముందు ముందు జరుగబోయేఅమెరికా తెలంగాణ సంఘం ప్రపంచ సమావేశాలకు మార్గదర్శకంగా ఉండిపోవాలని మిగతా కమిటీలన్నింటితో కలిసి నిరంతరం శ్రమిస్తున్నది.