Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆస్ట్రేలియాలో దేశపతి శ్రీనివాస్ ఘెరావ్

సోమవారం, 27 నవంబరు 2017 (22:41 IST)

Widgets Magazine
Australia

ఆస్ట్రేలియా: సిడ్నీలో ప్రపంచ తెలుగు సభల సన్నాహాక సభలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దేశపతి శ్రీనివాస్‌ని ఘెరావ్ చేసారు. ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణ ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఎటువంటి భాష పరిజ్ఞానం, సాహిత్య పరిచయంలేని వ్యాపారవేత్తను ఎన్నారై కో-ఆర్డినేటర్‌గా నియమించి తెలుగు మహాసభల స్థాయిని తగ్గించారని ఘెరావ్ చేసారు.
 
అమెరికాలో నివాసం ఉంటున్న మహేష్ బిగలను ఏ ప్రతిపాదికన తెలుగు సభల కో-ఆర్డినేటర్‌గా నియమించారని ఎటువంటి భాష పరిజ్ఞానం, సాహిత్యం తెలియని వారిని నియమించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని వెంటనే మహేష్‌ను తొలగించి ఆ స్థానంలో సాహిత్యవేత్తలకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. దేశపతి శ్రీనివాస్ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
 
మహేష్ బిగాల నియామకం పైన ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా అన్ని దేశాల్లో వ్యతిరేకించారని ఎందుకు తెలుగు సభల గౌరవాన్ని తగ్గిస్తారని నిలదీశారు. మహేష్ బిగల నియామకం చట్టరీత్య కూడా చెల్లదని దానికి ప్రతిపాదికనే సరిగా లేదని ఆయన్ని విధుల నుండి తప్పించాలని రాజశేఖర్ రెడ్డి మన్యం డిమాండ్ చేసారు. 
 
దేశపతి శ్రీనివాస్ రెడ్డి కులాన్ని కించపరచడం పైన ఎన్నారైల నిరసనలు  
గతంలో ఒక టివి ఛానల్‌లో దేశపతి శ్రీనివాస్ రెడ్డి కులంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై  పలువురు ఎన్నారైలు నిరసన తెలిపి కులం పేరున రాజకీయాలు తగవని ఏ కులాన్ని దూషించడం తగదని దేశపతి యావత్ తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం టీపీసీసీ ఎన్నారై సెల్ -ఆస్ట్రేలియా కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి మన్యం, మేక దేవి ప్రసాద్ రెడ్డి, సాయిరాం పసునూరి, ఖాజా ఇమ్రాన్ మహమ్మద్, జి రామ్, ప్రవీణ్ కట్టెకోల, పవన్ కుమార్ పోలిశెట్టిల ఆధ్వర్యంలో జరిగింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఎన్.ఆర్.ఐ.

news

ఇజ్రాయిల్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో “గజల్ గాంధీ గానం”(Video)

ప్రఖ్యాత గజల్ గాయకులు “మాస్ట్రో” డా. గజల్ శ్రీనివాస్ ఇజ్రాయిల్‌లో తన శాంతి సుహృద్భావ ...

news

నాట్స్ ప్రస్థానంలో మరో కీలక అడుగు... హ్యూస్టన్‌లో కొత్త చాప్టర్ ప్రారంభం

హ్యూస్టన్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రస్థానంలో మరో కీలకమైన ముందడుగు పడింది. ...

news

నాట్స్ చికాగో సంబరాల బృందం సేవలు ప్రశంసనీయం

చికాగో: చేయిచేయి కలిపి అడుగులు వేస్తే అద్భుతమైన విజయాలు మన సొంతమవుతాయి. ఒక్కరిగా ...

news

న్యూయార్క్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలుగు విద్యార్థిని

ఎన్నో ఆశలతో విదేశాలకు ఉన్నత చదువులు అభ్యసించేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థిని కొల్లూరు ...

Widgets Magazine