Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తల్లిదండ్రుల తృప్తి కోసమే తెలుగు అమ్మాయిలు... ఎన్నారై అబ్బాయిల వరస ఇదీ...

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (21:14 IST)

Widgets Magazine
harassment

ఎన్నారై సంబంధం అనేది ఎప్పటి నుంచో అదో క్రేజ్. మా అల్లుడు అమెరికాలో వుంటున్నాడు.. మా అబ్బాయి లండన్‌లో వుంటున్నాడు అని చెప్పుకుని మురిసిపోయేవారు చాలామందే. ఐతే విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడిన ఎన్నారై అబ్బాయిలు ఇండియాలో వుండే తమ తల్లిదండ్రుల తృప్తి మేరకు మాత్రమే ఇక్కడి అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుంటున్నారట. అలాంటి రాష్ట్రాల్లో ముందువరుసలో వుంటున్నవి తెలుగు రాష్ట్రాలని గణాంకాలు చెపుతున్నాయి. ఆ తర్వాత పంజాప్, గుజరాత్ రాష్ట్రాలు వుంటున్నాయట. 
 
విదేశీ ఉద్యోగం, డాలర్ల డబ్బు, అమ్మాయికి ఎలాంటి ఢోకా వుండదు అనుకునేవారికి ఇదో చేదు వార్తే. ఎందుకంటే విదేశీమంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2015 నుంచి 2017 మధ్య కాలంలో... అంటే 1064 రోజులకు గాను విదేశాల్లో నివాసముంటున్న ఎన్నారై భార్యల నుంచి 3,328 ఫిర్యాదులు వచ్చాయట. ఈ ఫిర్యాదుల్లో తమతమ భర్తలు తమను కట్నం కోసం వేధిస్తున్నారనో, తమను చిన్నచూపు చూస్తున్నారనో, ఇంకా హింసిస్తున్నారనో పేర్కొన్నారట.
 
వాషింగ్టన్ లోని భారతదేశ విదేశీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్తీ రావు మాట్లాడుతూ... తమకు ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు వెనువెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా తెలుగు ఎన్నారై మహిళలను కట్నం కోసమే వేధిస్తున్నట్లు తమకు అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా తమ తల్లిదండ్రులను తృప్తి పరిచేందుకే ఇక్కడ పనిచేసే ఎన్నారై అబ్బాయిలు తెలుగు రాష్ట్రాలకు వెళ్లి తెలుగు అమ్మాయిలను పెళ్లాడుతున్నారనీ, పెళ్లయ్యాక చాలామంది వారి భార్యలను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Shocking Andhrapradesh Telangana Domestic Abuse Telugu States Nri Women

Loading comments ...

ఎన్.ఆర్.ఐ.

news

ఘనంగా నాట్స్ మిస్సోరీ విభాగం 5 వ వార్షికోత్సవం

సెయింట్ లూయిస్: అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ...

news

ఆస్ట్రేలియాలో దేశపతి శ్రీనివాస్ ఘెరావ్

ఆస్ట్రేలియా: సిడ్నీలో ప్రపంచ తెలుగు సభల సన్నాహాక సభలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ...

news

ఇజ్రాయిల్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో “గజల్ గాంధీ గానం”(Video)

ప్రఖ్యాత గజల్ గాయకులు “మాస్ట్రో” డా. గజల్ శ్రీనివాస్ ఇజ్రాయిల్‌లో తన శాంతి సుహృద్భావ ...

news

నాట్స్ ప్రస్థానంలో మరో కీలక అడుగు... హ్యూస్టన్‌లో కొత్త చాప్టర్ ప్రారంభం

హ్యూస్టన్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రస్థానంలో మరో కీలకమైన ముందడుగు పడింది. ...

Widgets Magazine