శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (20:45 IST)

తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ (TeNF) నూతన కార్యవర్గం ఏర్పాటు

లండన్ : 5 సంవత్సరాలు పూర్తిచేసుకొని 6వ సంవత్సరం లోకి అడుగు పెడుతూ తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ (TeNF) నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 2012లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేసి సంస్కృతి, సేవ, భాషాభివృద

లండన్ : 5 సంవత్సరాలు పూర్తిచేసుకొని 6వ సంవత్సరం లోకి అడుగు పెడుతూ తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ (TeNF) నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 2012లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేసి సంస్కృతి, సేవ, భాషాభివృద్ధి లక్ష్యంగా తమవంతు బాధ్యతగా తెలంగాణాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 2017లో ''చేనేతకు చేయూత'' కార్యక్రమం ద్వారా చేనేత వస్త్రాలను విదేశాల్లో మొట్టమొదటిసారిగా భారీస్థాయిలో ప్రచారం చేసి మార్కెటింగ్ నిర్వహించి అనేక తెలంగాణ, తెలుగు సంఘాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 
 
మాతృభూమిలో రైతుకు అండగా, పేద విద్యార్థులకు ఆర్ధిక ఆసరాగా, అమరవీరుల కుటుంబాలకు అండగా అనేక కార్యక్రమాలు నిర్వహించి మార్గదర్శిగా ఉన్నది. ఇక్కడ బ్రిటన్‌లో నివసిస్తున్న తెలంగాణ వారి కోసం ఎప్పుడు భారీ స్థాయిలో సంస్కృతి ప్రచారంలో భాగంగా బతుకమ్మ, బోనాలు నిర్వహిస్తూ వస్తుంది. అలాగే  దేశ సేవలో భాగంగా స్వతంత్ర దినోత్సవం, అంబేద్కర్, గాంధీ జయంతి వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ తర్వాతి తరం వారికి దేశభక్తి నింపే ప్రయత్నాలు చేస్తుంది. 
 
గత ఏడాది నిర్వహించిన తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ (TeNF) బతుకమ్మకు 1500 మంది తెలంగాణ వారిని ఒక్కచోట కల్పిన ఘనత tenfదే. తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ (TeNF) వ్యవస్థాపక చైర్మన్ గంపా వేణుగోపాల్ నూతన కమిటీ ప్రెస్ ద్వారా తెలిపారు. సంస్థ కార్యాచరణ, కార్యక్రమాలు అన్ని కూడా నూతన వర్కింగ్ కమిటీ చేతనే జరుగుతాయని, కమిటీకి పూర్తి బాధ్యత ఉంటాయని తెలిపారు. 
 
నూతన కమిటీ అధ్యక్షులుగా సిక్కా చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా గోలి తిరుపతి, ప్రవీణ్ రెడ్డిలు, ప్రధాన కార్యదర్శులుగా కాసర్ల నగేష్ రెడ్డి, రంగుల సుధాకర్‌లు, సంయుక్త కార్యదర్శులుగా భాస్కర్ పిట్ల, సురేష్ గోపతిలు, కోశాధికారులుగా రంగు వెంకట్, మర్యాల నరేష్‌లు ఎంపికయ్యారు. అలాగే తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ నూతన కార్యవర్గంలో(2017-19) అడ్వైజరీ చైర్మన్‌గా అంతటి ప్రమోద్ గౌడ్‌ను నియమించారు. వీరితో పాటు బ్రిటన్ వ్యాప్తంగా  వివిధ  నగరాలకు ఇంచార్జ్‌లుగా దాదాపు 70 మందితో కూడిన కమిటీ ఏర్పాటయింది. 
 
బ్రిటన్‌లో తెలుగు తెలంగాణ సంఘాల్లో మొట్టమొదటి భారీ కార్యవర్గం ఇదే అని సంస్థ తెలిపింది. ''చేనేత చేయూత''తో పాటు ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో ''ఒక ఎన్ఆర్ఐ కుటుంబం ఒక రైతు కుటుంబం దత్తత  ''కార్యక్రమం చేబట్టి కార్యాచరణ రూపొందిస్తామని త్వరలో రైతు సహాయార్ధం ప్రణాళిక రూపొందిస్తామని నూతన కార్యవర్గం తెలిపింది.