గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 10 సెప్టెంబరు 2018 (20:04 IST)

భారతీయతను విస్మరించకండి: ప్రవాస భారతీయులకు వెంకయ్య సూచన

చికాగో: చికాగో వేదికగా భారతీయ గొప్పతనాన్ని చెప్పాల్సి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇదే వేదికగా వివేకానందుడు భారతీయ ధర్మం ఏమిటో చాటి చెప్పారని గుర్తు చేశారు. భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని వెంక

చికాగో: చికాగో వేదికగా భారతీయ గొప్పతనాన్ని చెప్పాల్సి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇదే వేదికగా వివేకానందుడు భారతీయ ధర్మం ఏమిటో చాటి చెప్పారని గుర్తు చేశారు. భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. చికాగోలో తెలుగువారు వెంకయ్యనాయుడిని ఘనంగా సన్మానించారు. 
 
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా.. నీ తల్లి భూమి భారతిని అన్నట్టు ప్రవాస భారతీయులు ఉండాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన ఈ తరుణంలో విదేశాల్లో ఉండే భారతీయులంతా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విస్మరించకూడదని తెలిపారు. భారతీయతను కాపాడటం.. దానిని భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. 
 
తెలుగుజాతికే వన్నె తెచ్చి.. పదవులకే అలంకారం తీసుకొచ్చిన వెంకయ్యనాయుడుని నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్ర హిందీ బోర్డు సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎన్నికల కమిషనర్ ఐ.వి. సుబ్బారావుతో పాటు పలువురు తెలుగు సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు.