Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శుభోదయం : ఆదివారం నాటి రాశిఫలాలు.. దానధర్మాలు చేస్తారు...

ఆదివారం, 12 నవంబరు 2017 (06:04 IST)

Widgets Magazine
daily astro

మేషం: ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. వేడుకల్లో పాల్గొంటారు. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. సంతానం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు. చిన్న పొరపాటే పెద్ద సమస్యకు దారితీసే ఆస్కారం వుంది. స్త్రీలకు తమ మాటే నెగ్గాలనే పంతం అధికంగా ఉంటుంది.
 
వృషభం: గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. రుణవిముక్తులవుతారు. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో పోటీ తత్వం ఆందోళన కలిగిస్తుంది.
 
మిథునం: దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. స్త్రీలకు పనిలో హడావుడి తప్పదు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారాలకు లాభదాయకంగా వుంటుంది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది.
 
కర్కాటకం: కుటుంబ ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ధనానికి ఇబ్బంది వుండదు. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. చెప్పుడు మాటలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కాదు. దైవదీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది.
 
సింహం: ఆర్థిక ఇబ్బందులు లేకున్నా వెలితిగా అనిపిస్తుంది. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. దానధర్మాలు చేసి మంచిపేరు, ఖ్యాతి గడిస్తారు. దైవదీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. విద్యార్థులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకులు అధికమవుతాయి.
 
కన్య: ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరీ సోదరుల గురించి ఓ రహస్ం తెలుసుకుంటారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు.
 
తుల : మీ రాక ఆత్మీయులకు సంతోషం కలిగిస్తుంది. ప్రింటింగ్, కంప్యూటర్ రంగాల వారికి లాభసాటి అవకాశాలు లభిస్తాయి. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి. భాగస్వామికులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వాహనం చోదకులకు ఏకాగ్రత ప్రధానం.
 
వృశ్చికం: వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిల పోటీ వాతావరణం అధికం కావడంతో ఆందోళన చెందుతారు. స్త్రీలకు కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు వంటివి ఎదుర్కొంటారు.
 
ధనస్సు : మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. మీ ఆశయసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల అవసరమని గమనించండి. ఇతరులకు ఉచిత సలహా ఇవ్వడం వల్ల మాటపడక తప్పదు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి.
 
మకరం: చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. మీడియా రంగాల్లో వారికి పనిభావం అధికం కాగలదు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మిత్రుల రాకతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
కుంభం: మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం వుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం.  కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి.
 
మీనం : వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ ప్రమేయం లేకుండానే కొన్ని చిక్కు సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీలకు శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

12-11-2017 నుంచి 18-11-2017 వరకు మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో రాహువు, కన్యలో కుజుడు, తులలో రవి, శుక్ర గురువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో ...

news

శుభోదయం : శనివారం దినఫలాలు .. అవకాశాలు వెతుక్కుంటూ

మేషం : బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. విద్యార్థులు బజారు ...

news

శుభోదయం : 10-11-2017 మీ రాశి ఫలితాలు, రావలసిన ఆదాయం...

మేషం : ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు ...

news

శుభోదయం : 09-11-2017 దినఫలితాలు

మేషం: ఆదాయానికి తగినట్లు ఖర్చులు వుంటాయి. పాత వస్తువులు కొనడానికి చేయు ప్రయత్నాలు ...

Widgets Magazine