శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ivr
Last Modified: బుధవారం, 31 డిశెంబరు 2014 (20:18 IST)

2015 మేషరాశి ఫలితాలు ఇలా ఉన్నాయి...

అశ్విని 1, 2, 3, 4 పాదములు (చూ,చే, చో, లా)
భరణి 1, 2, 3, 4 పాదములు (లీలూ, లే, లో) 
కృత్తిక 1వ పాదం (ఆ)
ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6
 
మేష రాశివారికి జూలై 14వ తేదీ వరకు చతుర్థము నుందు బృహస్పతి, ఆ తదుపరి అంతా పంచమము నందు, ఈ సంవత్సరం అంతా షష్ఠమము నందు రాహువు, వ్యయము నుందు కేతువు, ఈ సంవత్సరం అంతా అష్టమ శని సంచారిస్తారు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా, 'దారిద్య్రయ కృతం దానం' అన్నట్టుగా బంధు మిత్రులకు సహాయ, సహకారాలు అందించడం వల్ల సత్ కాలంలో సరియైన అభివృద్ధి, గుర్తింపు లభిస్తుంది. మీ కొత్తకొత్త ఆలోచనలు క్రియా రూపంలో పెట్టిండి. ఐశ్వర్య ప్రదాయైన ఈశ్వరుని ఆరాధించడం వల్ల మనోనిబ్బరత, సంకల్పసిద్ధి చేకూరుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. విశ్రాంతి లోపం అధికమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒక అడుగు ముందుకు వెళతారు. నూతన పెట్టుబడులకు ఈ సంవత్సరం ఎంతో అనుకూలం అని గమనించండి. 
 
అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ఆహార, వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, ఆలయ సందర్శనల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులకు మొదటి భాగం కన్నా రెండో భాగం శుభదాయకంగా ఉంటుంది. స్థిరచరాస్తుల పట్ల ఆసక్తి కనపరుస్తారు. ఫైనాన్స్, చిట్స్ వ్యాపార రంగాల్లో వారికి చికాకులు తప్పవు. క్రీడా రంగాల్లో వారికి సమయస్ఫూర్తికి మించి గుర్తింపు లభిస్తుంది. మీ కుటుంబీకుల వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఫ్లీడర్లకు, ఆడిటర్లకు ఆశాజనకం. పారిశ్రామిక రంగాల్లో వారికి పనివారితో సమస్యలు తలెత్త గలవు. 
 
కాంట్రాక్టర్లకు అనుకోని మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. పోస్టల్ రంగాల్లో వారికి మార్పులు అనుకూలించవు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, మీడియా, సాఫ్ట్‌వేర్ రంగాల్లో వారికి సంతృప్తి అభివృద్ధి కానవస్తుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. పెద్దలను, ప్రముఖులను కలుసుకోవడం వల్ల మీ పాత సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. రైతులకు ఆందోళన తప్పదు. రాజకీయాల్లో వారు తమ తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొన్న తెలివితో పరిష్కరిస్తారు. 
 
వాగ్ధానాలు చేయడం వల్ల ఆటంకాలు ఎదుర్కొనవలసి వస్తుంది. "ఈ రాశివారికి అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం అశ్వని నక్షత్రం వారు 9 సార్లు, భరణి నక్షత్రం వారు 20 సార్లు, కృత్తిక నక్షత్రం వారు 9 సార్లు నవగ్రహ ప్రదక్షిణం చేసి ఎర్రని పూలతో శనిని పూజించి, ప్రతి శని త్రయోదశికి కిలోపావు బియ్యం, కిలోపావు కందులు దానమిచ్చినా సర్వదా శుభం కలుగుతుంది. విద్యార్థులు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల విద్యాభివృద్ధి చేకూరగలదు. ఈ రాశివారు ప్రతి మాస శివరాత్రికి ఈశ్వరునికి అభిషేకం చేయించి తీర్థం తీసుకున్న ఆరోగ్యం, అభివృద్ధి చేకూరగలదు. 
 
ఈ క్రింది శ్లోకాన్ని 19 సార్లు ఉత్తర ముఖంగా తిరిగి పఠించినా లేక నవగ్రహాల చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఈ మంత్రాన్ని పఠించినా శనిదోషం తొలగిపోతుంది."
 
"నీలాంజన సమభాసం, రవి పుత్రం యమగ్రజమ్
ఛాయ మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరంII"
 
** అశ్వని నక్షత్రం వారు జీడి, మామిడి, భరణి నక్షత్రంవారు దేవదారు, కృత్తిక నక్షత్రం వారు అత్తి చెట్టును దేవాలయాల్లో గాని, విద్యా సంస్థల్లోగాని, ఖాళీ ప్రదేశాల్లో గాని, నాటి వాటి పురోభివృద్ధికి తోడ్పడిన మీకు అభివృద్ధి కానవస్తుంది. అశ్వని నక్షత్రం వారు కృష్ణవైఢూర్యం,  భరణి నక్షత్రం వారు వజ్రం, కృత్తిక నక్షత్రం వారు జాతికెంపు లేక స్టార్ రూబి అనే రాయిని ధరించిన అన్ని విధాలా అభివృద్ధి పొందుతారు.