శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ivr
Last Modified: బుధవారం, 31 డిశెంబరు 2014 (22:37 IST)

2015లో మీన రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి....

పూర్వాభాద్ర 4 పాదము (ట)
ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు (దూ, ఞ, ఝ, థా)
రేవతీ 1, 2, 3, 4 పాదములు (దే, దో, చా, చి)
ఆదాయం 2, వ్యయం 8, పూజ్య 1, అవమానం 7)

 
మీన రాశివారికి ఈ సంవత్సరం అంతా జన్మము నందు కేతువు, సప్తమము నందు రాహువు, జూలై 14 వరకు పంచమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా షష్ఠమము నందు, ఈ సంవత్సరం అంతా భాగ్యము నందు శని సంచరిస్తారు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా... 'సర్వం ఆత్మవశం సుఖం, సర్వం పరవశం దుఃఖం' అన్న వాస్తవాన్ని ఈ రాశివారు గ్రహిస్తారు. సమస్యలు తలెత్తినపుడు పూర్తి సామర్థ్యాన్ని చూపించాలి. మీరు చేపట్టిన పనుల్లో కొన్నిసార్లు వైఫల్యం తలెత్తినా తెలివితో ఎదుర్కొనండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం వల్ల ప్రపంచంలో ఎలా గెలుస్తారు? జిజ్ఞాస, విజ్ఞానం, సంకల్పబలం, పట్టుదలతో అనుకున్నది సాధించండి. విద్యార్థినులల్లో నూన్యత భావం అధికమువుతుంది. పెద్దవారిని, ఉపాధ్యాయులను తక్కువ అంచా వేసి మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. మిత్రులను అధికంగా నమ్మడం వల్ల, మిత్రులతో అధికంగా కాలం గడపడం వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. స్థిరాస్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. 
 
కిరాణా వ్యాపారస్తులకు గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సంతృప్తి, అభివృద్ధి కానరాగలదు. పాడి, పరిశ్రమ రంగాల్లో వారికి అశాంతి అధికమవుతుంది. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి జయం చేకూరగలదు. దూర ప్రయాణాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, మెటీరియల్‌కు సంబంధించిన వ్యాపారస్తులకు పురోభివృద్ధి. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సంతృప్తి, అభివృద్ధి కానరాగలదు. చిన్నచిన్న ప్రమాదాలు జరగవచ్చు. మత్య్సు, కోళ్ల, గొఱ్ఱెల వ్యాపారస్తులకు వాటి ఆహారం తయారు చేసే వ్యాపారస్తులకు అభివృద్ధి కానరాగలదు. పాడి, పరిశ్రమ రంగాల్లో వారికి అశాంతి అధికం అవుతుంది. 
 
చిన్నతరహా పరిశ్రమల్లో వారికి జయం చేకూరుతుంది. దూర ప్రయాణాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది. వైద్య రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఇంజనీరింగ్ రంగాల్లో వారికి, ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు ఆడిటర్లకు చేతినిండా పని ఉన్నందువల్ల సంతృప్తి పొందుతారు. ఇతరులు మీ ప్రభావానికి లోనవుతారు. స్టేషనరీ, ప్రిటింగ్ రంగాల్లో వారికి సామాన్యంగా ఉండగలదు. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. పౌరోహితులకు, వృత్తుల్లో వారికి, శాస్త్రజ్ఞులకు, పండితులకు వారివారి రంగాల్లో గుర్తింపు పొందుతారు. 
 
ఈ రాశివారు సదాశివుని దేవగన్నేరు పూలతో పూజించడం వల్ల పురోభివృద్ధి కానరాగలదు. కేతు ప్రభావం అధికంగా ఉన్నందువల్ల ఈ క్రింది శ్లోకాన్ని ప్రతి రోజూ 16 సార్లు పఠించడం వల్ల కానీ, నవగ్రహ ప్రదక్షిణం చేస్తూ మంత్రాన్ని జపించడం వల్ల కానీ, శుభం కలుగుతుంది. 
 
'ఓం తమోగ్రహాయ విద్మహే మహా వజ్రాయ ధీమహి తన్నః కేతు ప్రచోదయాత్'
 
** పూర్వాభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును, ఉత్రాభాద్ర వారు వేప చెట్టును, రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లో గానీ, ఖాళీ ప్రదేశాల్లో గానీ నాటి వాటి పురోభవృద్ధికి తోడ్పడిన మీకు అభివృద్ధి కానవస్తుంది. 
 
పూర్వాభద్ర నక్షత్రం వారు కనక పుష్యరాగం, లేక వైక్రాంతవణి, ఉత్తరాభద్ర నక్షత్రం వారు పుష్యనీలం, రేవతి నక్షత్రం వారు జాతిపచ్చ లేక గరుడపచ్చ అనే రాయిని ధరించినా కలిసిరాగలదు. దుర్గాదేవి పూజవల్ల, హనుమాన్ ఆరాధన వల్ల శుభం కలుగుదతుంది.