గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 16 ఆగస్టు 2014 (16:30 IST)

9, 18, 27 తేదీల్లో జన్మించిన స్త్రీలు ఎలా వుంటారు?

9, 18, 27 తేదీల్లో జన్మించిన స్త్రీలు ఎలా వుంటారో తెలుసుకోవాలా ? అయితే ఈ కథనం చదవండి. 9, 18, 27 తేదీల్లో పుట్టిన స్త్రీలు సాహస గుణ సంపన్నులు.

వీరు భారీ ఎత్తుగా ఉండి, చంద్రబింబం లాంటి మోమును కలిగివుంటారు. ఇతరులను ఇట్టే ఆకట్టుకునే సౌందర్యవంతులుగా ఉంటారు. పనుల్లో చురుకుదనం చూపిస్తారు. 
 
కోపాన్ని నిగ్రహించుకునే సత్తా వీరిలో ఉంటుంది. అయితే అతి సాహసం ఒక్కో సందర్భంలో అనుకూలించకపోవచ్చు. ఇతరులచే మోసం పోవడం జరుగుతుంది.

అందుచేత కొన్ని విషయాల్లో మెలకువ అవసరం. జీవితంలో సర్దుకుపోయే తత్త్వం వీరికుండదు. తద్వారా కొన్ని సమస్యలు తప్పవు. 
 
విద్యారంగంలో రాణించే ఈ జాతకులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ వుండాలి. వ్యవసాయం, వైద్యం, ఇంజనీరింగ్, గణిత సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

స్వార్జిత సంపాదన, ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. ఆస్తులకు ఏమాత్రం కొదువ వుండదు. స్వయం కృషితోనే ఈ జాతకులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు.