బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (16:57 IST)

అమరావతి నిర్మాణానికి ముహూర్తం: మధ్యాహ్నం 12.45.. మంచిది కాదట?

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం విజయ దశమి నాడు అట్టహాసంగా నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం శంకుస్థాపన కార్యక్రమానికి గాను విజయదశమి నాడు ఖరారు చేసిన మధ్యాహ్నం 12.45 గంటల ముహూర్తం మంచిది కాదని.. దీనికి 20 నెగటివ్ పాయింట్స్ ఉన్నాయని, జ్యోతిష్యులతో పాటు వాస్తు పండితులు కూడా అంటున్నారు. 
 
ఈ మేరకు వాస్తు విజ్ఞాన పరిషత్ కార్యదర్శి పల్లవజ్జుల శ్రీరామకృష్ణ శర్మ మాట్లాడుతూ.. రాజధాని శంకుస్థాపన కోసం మకర లగ్నంలో మధ్యాహ్నం 12.45 గంటలకు ముహూర్తం ఖరారు చేయ జరిగిందని.. ఇది అంత మంచిది కాదన్నారు. ఒక వేళ ఈ ముహూర్తంలో రాజధాని నిర్మాణం చేపడితే అస్థిరత్వం తప్పదని హెచ్చరిస్తున్నారు. 
 
టీడీపీ సర్కారు నిర్ణయించిన విజయదశమి ముహూర్తంలో ధనుర్ లగ్నంలో ఉదయం 11.39 గంటలకు రాజధానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే సరిపోతుందని చెప్పారు. ఈ ముహూర్తంలో ఈ కార్యక్రమం చేపడితే స్థిరత్వం కలుగుతుందన్నారు. మరి తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏ ముహూర్తంలో జరిపిస్తారో వేచి చూడాల్సిందే.