శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (09:32 IST)

తులసి ఆకుని నమలకుండా మింగేయాలి.. ఎందుకు?

తులసి ఆకుని నమలకుండా మింగేయాలి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. తులసి ఆకుని నమిలితే బయట గాలి తగిలి అందులోని ఔషధ గుణాలు కోల్పోతుంది. అదేమింగేస్తే.. గాలి తగలకుండా సరాసరి మన జీర్ణ వ్యవస్థకు చేరుకొని శరీరాన

తులసి ఆకుని నమలకుండా మింగేయాలి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. తులసి ఆకుని నమిలితే  బయట గాలి తగిలి అందులోని ఔషధ గుణాలు కోల్పోతుంది. అదేమింగేస్తే.. గాలి తగలకుండా సరాసరి మన జీర్ణ వ్యవస్థకు చేరుకొని శరీరానికి మేలు చేస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. గ్రహణం జరిగేటప్పుడు బయటకు వెళ్ళకూడదని పెద్దలంటూ వుంటారు.
 
 గ్రహణం జరిగేటప్పుడు అందరికి చూడాలని ఉంటుంది. గ్రహణం ఎలా జరుగుతుంది అన్న కుతూహలంలో సూర్యుడిని అలాగే చూస్తే కంటి చూపు దెబ్బతింటుంది. ఒక్కోసారి కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. ఇక అంత్యక్రియల నుంచి వచ్చినప్పుడు తప్పకుండా స్నానం చేయంటారు. ఎందుకంటే ఆత్మలు, దుష్ట శక్తులు మీ వెంట వస్తాయని నమ్ముతారు. 
 
కాని నిజానికి ఇలా చేయడానికి కారణం... మృతదేహం నుండి వ్యాపించే బ్యాక్టీరియాను తొలగించడానికి స్నానాలు తప్పకుండా చేయాలని ప్రస్తుతం వైద్యులు అంటున్నారు. ఏది ఏమైనా ఆనాటి పద్ధతులకు ఆరోగ్యానికి లింకున్న మాట నిజమే.