శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 16 అక్టోబరు 2014 (17:40 IST)

కార్తీక మాసంలో నేరేడు పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే?

కార్తీక మాసంలో నేరేడు పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే..? కీర్తి ప్రతిష్టలు దక్కుతాయని పండితులు అంటున్నారు. జీవితంలో అనుకున్న గమ్యానికి చేరుకోవాలంటే.. విజయాలకు చేరువవ్వాలంటే నేరేడు పండ్ల రసంతో శివాభిషేకం చేయించాలి. 
 
కాలకూట విషాన్ని మింగిన శివుడు ఆ తాపాన్ని తట్టుకోవడానికి చల్లదనాన్ని ఎక్కువగా కోరుకుంటాడు. ఈ కారణంతోనే ముక్కంటి మంచుకొండల మధ్య నివసిస్తుంటాడు. అనునిత్యం భక్తుల నుంచి అభిషేకాలు ఆశిస్తూ వుంటాడు. 
 
లోక కల్యాణం కోసం స్వామివారు కాలకూట విషాన్ని కంఠంలో దాచుకున్నాడు కనుక, స్వామివారికి ఉపశమనాన్ని కలిగించడానికి భక్తులంతా ప్రయత్నిస్తూ వుంటారు. పంచామృతాలతోను... ఫల రసాలతోను అభిషేకాలు చేయిస్తూ వుంటారు. 
 
ఇదే క్రమంలో నేరెడు పండ్ల రసంతో నీలకంఠుడికి అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా కార్తీక మాసంలో నేరేడు పండ్ల రసంతో స్వామివారికి అభిషేకం చేయించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.