Widgets Magazine

మీరు జూన్ 12, 21, 30 తేదీల్లో జన్మించారా?

మీరు జూన్ 12, 21, 30 తేదీల్లో జన్మించారా, అయితే ఉన్నత పదవులను అలంకరిస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు తెలియజేశారు. ప్రభుత్వ అధికారులుగానూ రాణిస్తారు. కేసులు సానుకూలమవుతాయి. భవన నిర్మాణాలు పూర్తవుతాయి. మేనమామ, బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది.

June
Kowsalya| Last Updated: సోమవారం, 11 జూన్ 2018 (11:15 IST)
మీరు జూన్ 12, 21, 30 తేదీల్లో జన్మించారా, అయితే ఉన్నత పదవులను అలంకరిస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు తెలియజేశారు. ప్రభుత్వ అధికారులుగానూ రాణిస్తారు. కేసులు సానుకూలమవుతాయి. భవన నిర్మాణాలు పూర్తవుతాయి. మేనమామ, బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది.
 
మీ సంతానం విషయంలో మీరు అనుకున్నట్లుగానే జరుగుతుంది. చేతికందవలసిన రుణాలు అందుతాయి. మీ స్నేహితులు మీ బలహీనతలను తెలుసుకుని ప్రవర్తిస్తారు. జాగ్రత్త వహించండి. అప్పులు తీరుతాయి. ఇతరులను అంత సులువుగా నమ్మకూడదు. తీర్థయాత్రలు చేస్తారు. మీకు నచ్చిన విధంగా వాహనాలను కొనుగోలు చేస్తారు.
 
ఈ సంఖ్యలో పుట్టిన అమ్మాయిలకు నచ్చిన వారితో వివాహం జరుగుతుంది. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. మీ నైపుణ్యాన్ని పెంచుకుంటారు.
 
అదృష్ట తేది : 27.
లక్కీ నెంబర్స్ : 3, 9.
లక్కీ కలర్స్ : సిల్వర్ గ్రే, పసుపు రంగులు కలిసొస్తాయి. 
అదృష్ట రోజులు : ఆది, శుక్ర వారాలు.

దీనిపై మరింత చదవండి :