శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 13 అక్టోబరు 2014 (19:51 IST)

బుధగ్రహ శాంతికి మిథున, కన్యారాశి జాతకులు ఏం చేయాలంటే!?

బుధగ్రహ శాంతికి మిథున, కన్యారాశి జాతకులు ఏం చేయాలని తెలుసుకోవాలా అయితే ఈ స్టోరీ చదవండి. బుధగ్రహం మిథున, కన్యారాశులకు అధిపతిగా పరిగణింపబడుతోంది.

ఈ గ్రహానికి అధిదేవత విష్ణుమూర్తి కావడం వలన, ఈయన ఎక్కువగా మేలే చేస్తాడని పంచాంగ నిపుణులు అంటున్నారు. తారాచంద్రుల కుమారుడైన బుధుడు సింహంపై సంచరిస్తూ వుంటాడు.
 
బుధగ్రహ సంబంధమైన దోషంతో బాధపడుతోన్నవాళ్లకి బుద్ధి మందగించడం వంటిసమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఈయనను శాంతింపజేయాలంటే 'పచ్చ'ను ధరించవలసి వుంటుంది.

అంతేకాకుండా బంగారాన్నీ, పగడాన్నీ, వివిధ రకాల పండ్లను, పెసలను, నెయ్యిని బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా బుధ గ్రహ అనుగ్రహంతో దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.