శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (15:47 IST)

చంద్రుని వల్ల కలిగే దోషాలు, శాంతి మార్గాలు!

చంద్రుని వల్ల కలిగే నష్టాలు ఏంటంటే.. మాతృ సంబంధమైన కష్టములు, అశాంతి, వ్యయము, క్షయ వంటి వ్యాధులు, కుష్ఠు, విష జంతువుల వలన బాధలు మొదలైనవి చంద్రబలము లోపించడం వల్ల కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
చంద్ర ధ్యానం 
శంఖ ప్రభుం వేణుప్రియం శశాంకం, ఈశాన మౌళిస్థిత మీడ్యరూపమ్ 
తమీపతించామృతసిక్తగాత్రం, ధ్యాయే హృదబ్జౌ శశినంగ్రహేంద్రమ్ ||
 
దదిశంఖ తుషారాభం క్షీరోదార్ణావ సముద్భవమ్ |
నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణమ్ ||
 
7 8 3
2 6 4
3 10 6 అనే సంఖ్యలతో కూడిన చంద్ర యంత్రం పూజారుల వద్ద నుంచి తీసుకొచ్చి సోమవారం చంద్ర హోరలో అనగా రాత్రి 8-9 గంటల మధ్య ఈ యంత్రం ధరించాలి.  
 
ప్రతినిత్యం ఉదయం స్నానం చేసి శుచిగా చంద్ర ధ్యానం 16సార్లు చేసి, మంత్ర జపం 108 మార్లు జపించి, యంత్రాన్ని పూజించి ధరించాలి. 
 
10 సోమవారాలు తెల్లని బియ్యము దానమివ్వాలి. సోమవారం గానీ, పౌర్ణమి రోజున గానీ తలంటుకొనుట, నలుగు పెట్టుకొనుట, జుట్టు విరబోసుకొనుట, నల్లటివస్త్రములు ధరించుట, మాంసాహారము, సంభోగం, రాత్రిభోజనము, జూదము, మద్యపానము, మంచముపై నిద్రించుట వంటివి చేయకుండా నియమంగా చంద్రుడిని ధ్యానిస్తే.. చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.