గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 17 నవంబరు 2014 (17:52 IST)

కప్పుతో కాఫీ గానీ టీ గాని తాగినట్లు కల వస్తే..?

* కప్పుతో కాఫీ గానీ టీ గానీ త్రాగుచున్నట్లు కల వచ్చినట్లైతే అదృష్టము కలిసి వచ్చును. 
 
నీటిలో కర్ర తేలుతున్నట్లు కల వచ్చినట్లైతే నిరుపయోగమైన ఆలోచనలు కలుగును. 
 
కర్రను నరుకుచున్నట్లు కల వచ్చినట్లైతే ధన నష్టము కలుగును. 
 
కర్రల మోపు మోయుచున్నట్లు కల వచ్చినట్లైతే ఆస్తి నష్టము కలుగును. 
 
కర్రను నిప్పులోకి విసిరినట్లు కల వచ్చినట్లైతే ధన నష్టము కలుగును 
 
కిరీటము ధరించునట్లు కల వస్తే ఆపదలు సంభవించును. 
 
రత్నాలు, వజ్రాలతో పొదగబడిన కిరీటము ధరించినట్లు కల వచ్చినట్లైతే స్నేహితులు అసూయ, ద్వేషముతో ప్రవర్తించెదరు.