శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (16:59 IST)

అర్థరాత్రిపూట కారణం లేకుండా కాకి అరిస్తే..?

అర్థరాత్రి సమయంలో ఏ కారణము లేకుండా కాకి అరచినట్లైతే అశుభసూచకము. అర్థరాత్రి పూట ఇంటిపై నుంచి కాకి అరిచినట్లైతే అశుభఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
కాకి శకునము కూడా ప్రయాణాల్లో తప్పక చూడాలి. కార్యార్థమై ఎక్కడికైనా ప్రయాణించినట్లైతే ఒక కాకి తనకు కుడి నుండి ఎడమ పక్కకు పోయినట్లైతే శుభప్రదము. తలంచిన కార్యములు దిగ్విజయముగా పూర్తి కాగలదు. అదే ప్రకారంగా రెండు కాకులు పోయినట్లైతే శీఘ్ర శుభ ఫలితాలు చేకూరుతాయి. మూడు కాకులైతే విశేష ఫలితాలు, ఉద్యోగ ప్రాప్తి చేకూరుతుంది.
 
ఒకటి గానీ, రెండుగానీ, మూడుగానీ కాకులు కుడి నుంచి ఎడమ ప్రక్కకు పోయి వెంటనే తిరిగి ఎడమ ప్రక్క నుంచి కుడి పక్కకు వచ్చినట్లైతే బహుకష్టములు, నష్టములు తప్పవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.