శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : మంగళవారం, 30 మే 2017 (17:28 IST)

31-05-2017 దిన ఫలాలు.. అతి చనువు పనికిరాదు... స్త్రీల మాటకు స్పందన...

మేషం : కుటుంబంలో స్త్రీల మాటకు మంచి స్పందన లభిస్తుంది. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్య

మేషం : కుటుంబంలో స్త్రీల మాటకు మంచి స్పందన లభిస్తుంది. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
వృషభం : ఇచ్చిన మాట నిలబెట్టుకునే యత్నంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. స్త్రీల ఒత్తిడి, మొహమ్మాటాలకు పోవడం వల్ల సమస్యలు తప్పవు. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. 
 
మిథునం : మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
కర్కాటకం: ఆర్థికంగా అభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు. ఉమ్మడి వెంచర్లు, భాగస్వామిక వ్యాపారాల ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయండి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలను ఎదుర్కొంటారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
సింహం: సమావేశానికి ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు హడావుడి , తొందరపాటు తగదు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటుచేసుకుంటాయి. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
కన్య: వృత్తిపరమైన బాధ్యతలు, ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కుటుంబీకులతో ఏకీభవించలేరు. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల వైఖరి ఎంతో నిరుత్సాహ పరుస్తాయి. రాబడికి మించిన ఖర్చులు అధికం కావడం వల్ల ఆందోళన చెందుతారు. 
 
తుల: పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు కలసిరాగలదు. తరచు దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. ఆకస్మిక ఖర్చులవల్ల ధనం చేతిలో నిలబడటం కష్టం. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
వృశ్చికం: మిత్రులతో రహస్య చర్చలు ఫలిస్తాయి. మీపై శకునాలు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఉపాధ్యాయ దంపతులకు ఒకేచోటికి బదిలీ అవుతుంది. నిరుద్యోగలకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. తీర్థయాత్రలు, దూరప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు.
 
ధనుస్సు: రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణబాధలు, ఒత్తిడులు, మానసిక ఆందోళన ఉంటాయి. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. 
 
మకరం : ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు అన్ని విధాలా కలిసిరాగలదు. కోర్టు పనులు వాయిదా పడటం మంచిదని గమనించండి. ఖర్చులు అధికమవుతాయి. భూములు, స్థలాలు కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలు బంధువుల రాకతో అనుకున్న పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. 
 
కుంభం : తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. అధికారులతో కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. 
 
మీనం : వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించవలసి ఉంటుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడే వారు అధికమవుతున్నారని గమనించండి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రముఖులకు అభినందనలు తెలియజేస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.