గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : బుధవారం, 15 ఆగస్టు 2018 (09:31 IST)

15-08-2018 - బుధవారం మీ రాశి ఫలితాలు.. బంధువులను సహాయం అర్ధించే బదులు?

మేషం: విద్యార్థులు బహుమతులు అందుకుంటారు. సాంస్కృతిక కార్కక్రమాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో మీ పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవడం మంచిదికాదు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్

మేషం: విద్యార్థులు బహుమతులు అందుకుంటారు. సాంస్కృతిక కార్కక్రమాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో మీ పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవడం మంచిదికాదు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటారు. 
 
వృషభం: పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. ఒప్పందాలు, నగదు చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది.
 
మిధునం: ఉపాధ్యాయులకు మంచిగుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. పుణ్యక్షేత్రాలు దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు. వ్యవహారాలలో స్వయంగా చూసుకోవాలి. అందరితో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు.   
 
కర్కాటకం: వ్యాపారంలో ఎదురైన ఒడిదుడులను అధికమిస్తారు. మీ నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. కళ, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. మితిమీరిన శ్రమ, విశ్రాంతి లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. మీ ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలు చికాకు పరుస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. 
 
సింహం: విద్యార్థులు క్విజ్ పోటీలలో పాల్గొని విజయం సాధిస్తారు. వాహనం చోదకులకు ఆటంకాలు తప్పవు. రాజకీయనాయకులు వేడుకలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విదేశీ ప్రయాణాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నరని గమనించండి. 
 
కన్య: వస్త్ర వ్యాపారులు పని వారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ ధ్యేయం నెరవేరాలంటే ఓర్పు, పట్టుదలతో శ్రమించవలసి ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి.  
 
తుల: మీ ఆర్థికస్థితిని చూసి ఇతరులు అపోహపడే ఆస్కారం ఉంది. పురస్కారాలు వంటివి పొందుతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నం సాగించండి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. జూదాల్లో, ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. 
 
వృశ్చికం: విద్యార్థులు ప్రముఖుల నుండి బహుమతులు అందుకుంటారు. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయమవుతుంది. వ్యాపార వర్గాలవారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. విదేశీయాన యత్నాలలో శ్రమ, ప్రయాసలు ఎదుర్కుంటారు. 
 
ధనస్సు: ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ, పుణ్య, సేవా కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు. మార్కెటింగ్ రంగాలవారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ మాటలు ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ఆస్కారం ఉంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
మకరం: విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ రాక బంధువులకు ఆనందాన్ని ఇస్తుంది. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల చాలా అవసరం. చిట్స్, ఫైనాన్స్ రంగాలవారికి ఖాతాదారుల నుండి ఒత్తిడి, చికాకులు ఎదురవుతాయి. విందులలో పరిమిత పాటించండి. 
 
కుంభం: సాహన ప్రయత్నాలలో జయం చేకూరుతుంది. ఖర్చులు ఆదాయానికి తగినట్లుగా ఉంటాయి. స్త్రీలు దైవ, పుణ్య కార్యల్లే పాల్గొంటారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల గురించి అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది.
 
మీనం: ఒక వ్యవహార నిమిత్తం తరచు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. మీ సంతానం కోసం ధనం బాగుగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు వాహనం సౌఖ్యం, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది.