శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : ఆదివారం, 28 మే 2017 (17:46 IST)

29-05-17 రాశి ఫలితాలు.. స్త్రీలతో మితంగా సంభాషించండి.. లేదంటే...

ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి సామాన్యం. కీలకమైన విషయాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం మంచిదని గమనించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వా

మేషం
ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి సామాన్యం. కీలకమైన విషయాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం మంచిదని గమనించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. రుణం ఓ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం ఫలిస్తుంది. 
 
వృషభం
శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురవుతారు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఓర్పు, సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు వాయిదా పడటం మంచిది. 

మిథునం 
పత్రికా రంగంలో పని చేసే సిబ్బందికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. నిత్యావసరవస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించి సదావకాశాలు లభిస్తాయి. 

కర్కాటకం 
ఎదుటివారి విషయాలు దూరంగా ఉండటం శ్రేయస్కరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళనలు అధికమవుతాయి. స్త్రీలు బంధువర్గాల నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. దైవ, సేవా పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

సింహం
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించకపోవచ్చు. మిత్రుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి వేధింపులు, చికాకులను ఎదుర్కొంటారు. 

కన్య 
కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ఖర్చుల వల్ల ధనం చేతిలో నిలబడటం కష్టం. ఆపత్సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. 

తుల
ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి వేధింపులు, చికాకులు తప్పవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. శ్రమాధిక్యతతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. 

వృశ్చికం 
ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 

ధనస్సు
ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. నూతన పరిచయాలు అధికమవుతాయి. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించకపోవచ్చు. మిత్రుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. 

మకరం
ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రేమకు విపరీత ధోరణి అనర్థాలకు దారితీస్తుంది. మీ అభిప్రాయాలను కుటుంబీకులు వ్యతిరేకిస్తారు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. హామీ, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 

కుంభం 
పాత్రమిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. అపరాలు, ధాన్యం, వాణిజ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. గృహమరమ్మతులు, నిర్మాణాలు చేపడుతారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం తప్పవు. స్త్రీలు అశాంతి, అసంతృప్తికి లోనవుతారు. 

మీనం 
ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు. మీ మాటకు కుటుంబంలోనూ, గౌరవం లభిస్తుంది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.