Widgets Magazine

ఆదివారం దినఫలాలు : స్త్రీలు ఆడంబరాలకు పోరాదు...

మేషం: సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ విషయాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరా

daily astro
raman| Last Updated: ఆదివారం, 14 జనవరి 2018 (07:56 IST)
మేషం: సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ విషయాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. సంఘంలో మీ ఉన్నతికి, పరపతికి గౌరవం, గుర్తింపు లభిస్తాయి.
వృషభం: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఏవైమా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. సన్నిహితుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు.

మిథునం: బంధువుల రాకపోకలు అధికమవుతాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, సంప్రదింపులతో క్షణం తీరిక ఉండదు. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి.
కర్కాటకం: పందేలు, జూదాల వల్ల ఇరకాటంలో పడతారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ఇంటర్వ్యూల్లో అనుకూల ఫలితాలు. వాయిదాపడిన మొక్కుబడులు ఎట్టకేలకు తీర్చుకుంటారు. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.

సింహం: మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఊహించని ఖర్చులు, విద్యుత్ బిల్లులు, చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి.
కన్య: ఆర్థికంగా వెనుకపడతారు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులకు నూతనోత్సాహం కానవస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సహోద్యోగులకు, బంధుమిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. వాహనం నడుపునప్పుడు మెళుకువ అవసరం. ప్రయాణాల్లో చికాకులు తప్పవు.

తుల: మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. స్త్రీలకు వస్తువు, వస్త్ర, ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.
వృశ్చికం: నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. రవాణా, ప్రకటనలు, విద్యా రంగంలోని వారికి శుభప్రదం. రావలసిన బకాయిలు సకాలంలో అందినా ధనం ఏమాత్రం నిలువ చేయలేకపోతారు.

ధనస్సు: దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు తలెత్తుతాయి. కిరణా వ్యాపారులకు సామాన్యంగా ఉండగలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత చాలా అవసరం. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు.
మకరం: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. అనవసరపు సంభాషణ వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం వుంది. రావలసిన ధనం వాయిదా పడుతుంది. బంధువుల రాకతో ఆకస్మికంగా ఖర్చులు అధికమవుతాయి. సన్నిహితులతో కలయిక విందు, వినోదాల్లో పాల్గొంటారు.

కుంభం: ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. శాస్త్ర సంబంధమైన విషయాలు ఆసక్తిని చూపుతాయి. రాజకీయనాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది.
మీనం: ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. మీ సంతానం ప్రేమ వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. కొబ్బరి, పూలు, పండ్లు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పూర్వపు అప్పులు తీర్చెదరు.


దీనిపై మరింత చదవండి :