Widgets Magazine

మంగళవారం మీ రాశిఫలితాలు : జీవిత భాగస్వామికి...

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (08:38 IST)

daily astro

మేషం: ఆర్థిక పరిస్థితులు కొంత వరకు మెరుగుపడతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేయడం మంచిది కాదని గమనించండి. మీ యత్నాలకు జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. 
 
వృషభం: ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. పాత మిత్రుల కలయిక గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. 
 
మిథునం: విద్యార్థులకు శ్రమానంతరం ఫలితాలు దక్కుతాయి. ముఖ్యులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునః ప్రారంభించేందుకు చేయు యత్నాలు కలిసివస్తాయి. 
 
కర్కాటకం: సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. మీ ఆశయ సాధనకు ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు నిరుత్సాహం తప్పదు. రావలసిన ధనం అందటంతో ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. 
 
సింహం: పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికుల వల్ల సమస్యలు తప్పవు. వాహనం నడుపునప్పుడు మెళకువ అవసరం. బంధుమిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రాజకీయ నాయకులు సభ సమావేశాల్లో పాల్గొంటారు.
 
కన్య: చిన్న చిన్న సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు. అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. ఏదైనా స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. 
 
తుల: కొబ్బరి, పండ్ల, పూల, వ్యాపారులకు లాభదాయకం. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. నిరుద్యోగులు ఒక పత్రికా ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఆడంబరాలకు, బంధుమిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. 
 
వృశ్చికం: విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. సమావేశాలు, వేడుకల్లో చిన్నారులు కీలక పాత్ర పోషిస్తారు. ప్రయాణాల్లో మెళకువ అవసరం. స్త్రీలకు అసహనం, నిరుత్సాహం, ఏ విషయం పట్ల ఆస్తి ఉండకపోవడం వంటి చికాకులు ఎదురవుతాయి. 
 
ధనస్సు: వృత్తి వ్యాపారుల మధ్య నూతన స్నేహం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మకరం: ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల జోక్యం అనివార్యమవుతుంది. ఖర్చులు అధికం కావడం, వృధా ధనవ్యయం వల్ల నిరుత్సాహం చెందుతారు. 
 
కుంభం: బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. మిమ్ములను కొంతమంది ధన సహాయం అర్ధిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు తప్పవు. 
 
మీనం : విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో మొహమ్మాటాలకు తావివ్వండి. బ్యాంకు పనులు, నగదు విషయంలో మెళకువ వహించండి. మీలో వచ్చిన మార్పు మీ శ్రీమతికి సంతోషం కలిగిస్తుంది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

సోమవారం మీ రాశిఫలితాలు : ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే...

మేషం: ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్ ఆర్డర్లు ...

news

పెళ్లిళ్ల సీజన్ మొదలు.. మార్చి 3న 50 వేలకు మించిన వివాహాలు

పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. ఈ నెల 19 నుంచి అక్టోబర్ వరకు అన్నీ మంచి ముహూర్తాలే కావడంతో ...

news

4-02-2018 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరం

మేషం: దీర్ఘకాలిక పెట్టుబడులు, భాగస్వామిక వ్యాపారాల విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీలకు ...

news

04-02-2018 నుంచి 10-02-2018 వరకు మీ రాశి ఫలితాలు

కర్కాటకంలో రాహువు, తులలో బృహస్పతి, వృశ్చికంలో కుజుడు, ధనస్సులో శని, మకరంలో శుక్ర, బుధ, ...

Widgets Magazine