Widgets Magazine

16-04-2018 సోమవారం మీ రాశి ఫలితాలు.. సోదరీ, సోదరుల తీరు మనస్తాపం?

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (06:55 IST)

మేషం: మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. చిరకాలపు స్వప్నాలు నిజమవుతాయి. రోజులు భారంగా  మందకొడిగా సాగుతాయి.
 
వృషభం: ఒక వేడుకను ఘనంగా చేయడానికి సన్నాహాలు మొదలెడతారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. చిన్న పొరపాటే పెద్ద సమస్యకు దారితీస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేనివ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. రాజకీయాలలో వారికి విరోధులు అధికమవుతున్నారని గమనించండి.
 
మిథునం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. విద్యార్థులు క్రీడారంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ, సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఆహార వ్యవహారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. పాత రుణాలు తీరుస్తారు.
 
కర్కాటకం: వృత్తిపరంగా ప్రయాణాలు, సరుకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. మీ ఆశయం, క్రీయా రూపంలో పెట్టినట్లైతే సఫలీకృతులౌతారు. చిన్ననాటి  మిత్రుల కలయిక మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సినిమా రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. బంధవుల రాకతో స్త్రీలలో ఉత్సాహం చోటు చేసుకుంటుంది.
 
సింహం: విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. రాజకీయ, క్రీడా రంగాల వారికి విదేశీ పర్యటనలు  అనుకూలిస్తాయి. వాతావరణంలోని మార్పు వల్ల మీ పనులు అనుకున్నంతగా సాగవు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుంది. మీ ఉన్నతిని చూసి కొందమంది అపోహపడే ఆస్కారం ఉంది. కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ఆత్మీయుల కోసం బాగా శ్రమిస్తారు. ఆస్తి వ్యవహారాలు, భూవివాదాలు పరిష్కారం కాగలవు. చేపట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. ఒత్తిడి, మొహమ్మాటాలకు పోకుండా ఖచ్చితంగా వ్యవహరించండి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది.
 
కన్య : ధనం ఎంత వెచ్చించినా ఫలితం ఉండదు. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, ఆటుపోట్లు ఎదుర్కుంటారు. స్త్రీల అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవాల్సివస్తుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో జాప్యం, పనివారల తీరు వల్ల మాటపడవలసి వస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
వృశ్చికం: సోదరీ, సోదరుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. ప్రయాణంలో చికాకులెదుర్కుంటారు. వనసమారాధనలకు సన్నాహాలు సాగిస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కిరాణా, ఫాన్సీ, నిత్యావసరవస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాలదు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
ధనస్సు : నిరుద్యోగులకు ఇంటర్వూలు, రాత పరీక్షలలో మెలకువ, ఏకాగ్రత అవసరం. హోటలు, కేటరింగ్, తినుబండ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత అవసరం. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.
 
మకరం: వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. అవివాహితుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. దైవ, సేవా, పుణ్య కార్యాల్లో మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. స్త్రీలకు వైద్యసలహా, ఔషధసేవనం తప్పదు. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు.
 
కుంభం: ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. రావలసిన ధనం చేతికందుతుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. మీ శ్రీమతితో అనునయంగా  మెలగాలి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.
 
మీనం: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు మందకొడిగా సాగుతాయి. విజ్ఞతతో మీ ఆత్మాభిమానం కాపాడుకుంటారు. మీ సంతానం కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. కష్టసమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. పాతమిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

15-04-2018 ఆదివారం మీ రాశి ఫలితాలు.. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును?

మేషం: గొర్రె, మత్సత్య, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి ఆందోళనలు తొలగిపోతాయి. స్త్రీలు ...

news

వార ఫలాలు - 15-04-2018 నుంచి 21-04-2018వ తేదీ వరకు...

వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాహ ...

news

శనివారం (14-04-2018) దినఫలాలు - మీరంటే గిట్టని వ్యక్తులను సైతం...

మేషం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల రాకపోకలవల్ల గృహంలో ...

news

శుక్రవారం (13-04-18) దినఫలాలు : ఓర్పు - పట్టుదలకు పరీక్షా సమయం..

మేషం : విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, ప్రేమ విషయాల మీద విరక్తి నెలకొంటాయి. ...

Widgets Magazine