బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (09:40 IST)

05-04-2019 - శుక్రవారం మీ రాశి ఫలితాలు - స్త్రీలకు పనిభారం అధికమవుతుంది...

మేషం: స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు. వ్యాపార, ఆర్థిక రహస్యాలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్, ఇంజనీరింగ్ రంగాల వారికి పనిభారం తప్పవు.
 
వృషభం: సోదరీసోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. టెండర్లు, ఏజెన్సీలు, లీజు పొడిగింపులకు అనుకూలం. విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశం లభిస్తుంది. కీల సమావేశాల్లో పాల్గొంటారు.
 
మిధునం: పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వ్యాపారాల్లో రాణింపు, లాభాలు గడిస్తారు. భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయి. ఇతరులకు ధనం ఇవ్వడం వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి అధికారిక వేధింపులు అధికం.
 
కర్కాటకం: కోర్టు పనులు వాయిదా పడడం మంచిదని గమనించండి. స్థిరచరాస్తులకు సంబంధించిన సంప్రదింపుల, వాణిజ్య ఒప్పందాలు కొత్త మలుపు తిరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తికావడంతో మానసిక సంతృప్తి పొందుతారు. కొంతమంది మిమ్ములను ధనసహాయం లేక హామీలు కోరవచ్చు.
 
సింహం: కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆర్థికపరమైన ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. దూరప్రాంతం నుండి వచ్చిన ఒక లేఖ మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
కన్య: వ్యాపార వ్యవహారాల్లో మెళకువ అవసరం. బంధువులరాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగ ప్రకటనలపై అవగాహన ముఖ్యం. వ్యవసాయ కూలీలకు, భవన కార్మికులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఇతరుల ముందు మీ ఉన్నతిని చాటుకునే యత్నాలు విరమించండి. 
 
తుల: ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన లోపిస్తుంది. వాహన చోదకులకు చికాకులు తలెత్తుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. చిన్న తరహా, చిరువ్యాపారులకు పురోభివృద్ధి.
 
వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణాలు, వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమించాలి. మీ సమస్యలకు ఒక చక్కనిపరిష్కార మార్గం లభిస్తుంది. దూరప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
ధనస్సు: ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. 
 
మకరం: సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల తీరుకు అనుగుణంగా మెలగాలి. ప్రేమికులకు తొందరపాటు తగదు. స్థిరచరాస్తుల విషయంలో ముఖ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. కిరాణా, ధాన్యం వ్యాపారులకు, స్టాకిస్టులకు మెళకువ అవసరం. 
 
కుంభం: ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకుని తెలివి తేటలతో ముందుకు సాగి జయం పొందండి. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు.  
 
మీనం: ఆర్థికంగా పురోభివృద్ధి పొందుతారు. బంధువులతో అభిప్రాయ భేదాలు, పట్టింపులు తలెత్తుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంప్రదింపులు, ఒప్పందాలు కొలిక్కివస్తాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో ఆసక్తి, ఉత్సాహంగా పాల్గొంటారు.