మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (08:46 IST)

బుధవారం (06-06-18) దినఫలాలు .. మీ అలవాట్లు, బలహీనతలు...

మేషం: స్త్రీలకు టీవిఛానెళ్ళ కార్యక్రమాల పట్ల ఆసక్తి, తగిన అవకాశాలు కలిసి వస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, దైవసామగ్రి, పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీసోదరుల మధ్య ఆస్తివిషయాల గురించి తగాదాలు రా

మేషం: స్త్రీలకు టీవిఛానెళ్ళ కార్యక్రమాల పట్ల ఆసక్తి, తగిన అవకాశాలు కలిసి వస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, దైవసామగ్రి, పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీసోదరుల మధ్య ఆస్తివిషయాల గురించి తగాదాలు రావచ్చు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం.
 
వృషభం: ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోవవుతారు. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. ప్రింటింగ్ రంగాలవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి.
 
మిధునం: ప్రభుత్వ కార్యాయాలలోని పనులు వాయిదా పడవచ్చు. స్త్రీలు కొత్తవ్యక్తులతో తక్కువగా సంభాషించడం మంచిది. ఎండుమిర్చి, నూనె, బెల్లం, ఆవాలు, పసుపు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశీయోగం కోసంచేసే యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో మంచిపేరు, ఖ్యాతి గడిస్తారు. 
 
కర్కాటకం: ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారమార్గం గోచరిస్తుంది. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన మంచిది. రాజకీయ, కళారంగాలవారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూకోసం పడిగాపులు తప్పువు. మీకు వ్యాపకాలు తగ్గించుకుని కుటుంబ విషయాలపై దృష్టి సారించాలి.
 
సింహం: కుటుంబ సమస్యలను పట్టించుకోకుండా ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపార వర్గాలవారికి ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవటం మంచిదికాదు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
కన్య: భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించినా మార్పులుంటాయి. పుణ్యక్షేత్రాలు దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మిమ్ములను తప్పుదారి పట్టించి లబ్ధిపొందాలని యత్నిస్తారు. సమాచారలోపం వల్ల నిరుద్యోగులు ఒక అవకాశాన్ని జారవిడుచుకుంటారు.
 
తుల: ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచలున్నాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. చిట్స్, ఫైనాన్సు వ్యాపారుల తీరు ఆందోళం కలిగిస్తుంది. టెండర్లు, ఏజెన్సీలు, లీజు పొడిగింపులకు అనుకూలం. వివాదాస్ప విషయాలకు దూరంగా ఉండాలి. పెద్దల ఆరోగ్యము గురించి మానసికంగా ఆందోళన చెందుతారు. 
 
వృశ్చికం: వ్యాపారుల అభివృద్ధికి కొత్త పథకాలు అమలుచేస్తారు. దూరప్రయాణాలలో జాగ్రత్త అవసరం. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచనమంచిది.
 
ధనస్సు: రెండో విడత కౌన్సెలింగ్‌కో కోరుకున్న విద్యావకాశం లభిస్తుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు శుభదాయకం. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం నిరుత్సాహం కలిగిస్తుంది. మీ ఇంటిని సరికొత్తగా మలచుకోవాలన్న మీ ఆశ నెరవేరదు. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి.
 
మకరం: మీపై శకునాలు తీవ్రప్రభావం చూపుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీ చిన్నారుల భవిష్యత్ గురించితగు శ్రద్ధ తీసుకుంటారు. గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్తారం ఉంది. జాగ్రత్త వహించండి. విద్యా, వైద్య సంస్థల్లో వారిశ్రమకు తగిన ప్రతిఫలం లభించడంతో మానసికంగా కుదుటపడతారు.
 
కుంభం: వ్యాపార వర్గాల వారికి అధికారుల తనిఖీలు, షాపు గుమస్తాల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి. స్త్రీలు అందరియందు కలుపుగోలు తనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు కొత్తమలుపు తిరుగుతాయి. రవాణా రంగాలవారికి ఇబ్బందులు తప్పవు. పాత బాకీలు సైతం వసూలవుతాయి.
 
మీనం: ఆర్థికపరమైన చర్చలు, కీలకమైన నిర్ణయాలకు ఇది అనుకూలం. రహస్యవిరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. గృహంలో స్వల్ప మార్పులు, చేర్పులు చేపడతారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్తారం ఉంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.