Widgets Magazine

గురువారం మీ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

గురువారం, 9 ఆగస్టు 2018 (09:00 IST)

మేషం: వ్యాపారాలలో పోటీ పెరగడం వలన అధికంగా శ్రమించవలసి ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల వలన ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరీసోదరుల మధ్య అవగాహన కుదరదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలవారికి గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం: ఆర్ధికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. ఉద్యోగస్తుల శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలను సాధిస్తారు. 
 
మిధునం: నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. ఆత్మీయులరాకతో మానసికంగా కుదుటపడుతారు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. వృత్తులవారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ప్రోత్సాహం లభిస్తాయి.  
 
కర్కాటకం: తలపెట్టిన పనులు ఏ మాత్రం ముందుకు సాగవు. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు పోటి పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ముఖ్యల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
సింహం: రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహపరుస్తాయి. రవాణా, ఆటోమోబైల్, మోకానికల్ రంగాలలోవారికి సంతృప్తి కానరాగలదు. స్త్రీలు టి.వి, ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, నేర్పు అవసరం. ప్రేమికులు అతిగా వ్యవహిరించడం వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
కన్య: విద్యార్థినులకు తోటివారి వలన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ధనం అధకంగా వ్యయం చేస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలవారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు ప్రగతి పథంలో సాగుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడంతో నిరుత్సాహానికి గురవుతారు.  
 
తుల: సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. మీ నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఉన్నత వ్యక్తులతో పరిచయం వలన వ్యాపకాలు అధికమవుతాయి. ప్రింటింగ్ రంగాలవారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రముఖులు బహమతులు అందజేస్తారు. 
 
వృశ్చికం: దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడుతాయి. వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. సమయస్పూర్తితో వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత మినహా ఫలితం ఏ మాత్రం ఉండదు.  
 
ధనస్సు: కళ, క్రీడా రంగాలవారికి ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల శాశ్వత పరిష్కారానికి బాగా శ్రమస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానియ చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
మకరం: ఆర్ధిక విషయాల్లో ప్రణాళిబద్ధంగా వ్యవహరిస్తారు. రుణాల కోసం అన్వేషిస్తారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు అయినవారి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో జాప్యం తప్పదు. 
 
కుంభం: ఉద్యోగస్తులకు పై అధికారులతో సదవగాహన, తోటివారి సహకారం లభించదు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడూ సద్వినియోగం చేసుకోవడం మంచిది. రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్య జరుపుటవలన జయం చేకూరుతుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. 
 
మీనం: స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగస్తుల దైనందిని కార్యక్రమాలు యధావిధాగా సాగుతాయి. రాజకీయాల వారికి పార్టీ పరంగా గుర్తింపు లభిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడ మంచిది.  


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
పంచాంగం ఆస్ట్రాలజీ భవిష్యవాణి దినఫలాలు రాశిచక్రం Daily Predictions Daily Astrology Today Astro Daily Horoscope

Loading comments ...

భవిష్యవాణి

news

బుధవారం (08-08-18) దినఫలాలు - నూతన దంపతుల మధ్య...

మేషం: కొత్త వ్యాపారాభివృద్ధికి శ్రమించాలి. స్వయం కృషితో రాణిస్తారు. విద్యార్థులకు ...

news

నాగ పంచమి రోజున ఆ రెండు పనులు చేయకండి..

స్కంద పురాణంలో నాగ పంచమి విశిష్టతను సాక్షాత్ పరమ శివుడే పురాణాల్లో వివరించి వున్నాడు. ...

news

కలలు ఎందుకు వస్తాయో తెలుసా?

కల అనే రెండు అక్షరాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కలలు కంటూనే ఉంటారు. ...

news

మంగళవారం (07-08-2018) దినఫలాలు - ఉచిత సలహా ఇచ్చి...

మేషం: ఆర్థిక, కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. పత్రికా సంస్థలలోని వారికి ...

Widgets Magazine